Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నగలు, చీరలు కొంటూ దొరికిపోయిన శ్రీయ..... పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది!
Recommended Video
హీరోయిన్ శ్రీయ వివాహం జరుగబోతోందంటూ రెండు రోజులుగా మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె తన రష్యన్ బాయ్ ఫ్రెండును పెళ్లాడబోతోందని, త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి వేడుక చూడబోతున్నామంటూ వార్తలు రావడంతో అంతా నిజమే అనుకున్నారు, ఇటీవల ఆమె భారీగా నగలు, చీరలు కొనడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిఇచ్చాయి. ఈ వార్తలపై తాజాగా శ్రీయ క్లారిటీ ఇచ్చారు.
పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీయ
అయితే మీడియాలో తన పెళ్లి గురించి వార్తలు రావడంపై శ్రీయ స్పందించారు. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, దానికి ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు.
నగలు, చీరలు కొన్నది అందుకే
తన స్నేహితురాలి వివాహం ఉండటంతో నగలు ఆర్డర్ ఇచ్చానని, చీరలు కొనుగోలు చేశానని, చాలా మంది ఇవి నా వివాహం కోసం అని పొరపాటు పడ్డారని శ్రియ వివరణ ఇచ్చారు.
రాజస్థాన్‌లో వివాహం నిజమే కానీ, నా కూతురు వివాహం కాదు
శ్రీయ తల్లి నీరజ స్పందిస్తూ... తన కూతురు పెళ్లి వార్తలను తోసిపుచ్చారు. అందులో నిజం లేదన్నారు. రాజస్థాన్‌లో శ్రీయ స్నేహితురాలి వివాహం జరుగబోతోందని, అందుకే నగలు, చీరలు ఆర్డర్ చేసినట్లు నీరజ తెలిపారు.
మార్చిలో శ్రీయ బంధువులు, స్నేహితుల వివాహాలు
మార్చి నెలలో తమ బంధువుల వివాహ వేడుకలతో పాటు, శ్రీయ స్నేహితుల వివాహాలు ఉన్నాయని, వాటికి తాము హాజరవుతున్న నేపథ్యంలోనే నగలు, చీరలు కొనుగోలు చేసినట్లు శ్రీయ తల్లి నీరజ వెల్లడించారు.
శ్రీయ నటిస్తున్న సినిమాలు
శ్రీయ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో కార్తీక్ నరేన్ మూవీ ‘నరగాసూరన్' చిత్రంలో నటిస్తోంది. తెలుగులో శ్రీయ నటించిన ‘గాయిత్రి' చిత్రం ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు ఆమె ప్రకాష్ రాజ్ బాలీవుడ్ మూవీ ‘తడ్కా' చిత్రంలోనూ నటిస్తోంది.