»   » ఇండస్ట్రీని చూస్తే సిగ్గేస్తోంది, ఎవరినీ వదలను: పవన్ కళ్యాణ్‌ కామెంట్లకు శ్రీరెడ్డి కౌంటర్

ఇండస్ట్రీని చూస్తే సిగ్గేస్తోంది, ఎవరినీ వదలను: పవన్ కళ్యాణ్‌ కామెంట్లకు శ్రీరెడ్డి కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్, మహిళలకు ఎదురవుతున్న లైంగిక వేధింపులపై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంపై పవన్ కళ్యాణ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె తన పోరాటానికి ఎంచుకున్న దారిని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. నిరసన తెలియజేసే విధానం ఇది కాదని, అన్యాయం జరిగిఉంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలి, చట్టాల ద్వారానే న్యాయం జరగాలి, అది మీడియా ఛానళ్ల ద్వారా కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్లపై శ్రీరెడ్డి స్పందించారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి అసంతృప్తి

తాను చేస్తున్న పోరాటంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను శ్రీరెడ్డి తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్ సర్ స్టేట్మెంట్ తనకు సంతోషాన్ని ఇవ్వలేదన్నారు. ఇతర మహిళల రక్షణపై మాట్లాడారు, నన్ను తక్కువ చేసి మాట్లాడారు మీరు నాకు అర్థం కావడం లేదు. నాకు ఈ విషయంలో ఎలాంటి అసూయ లేదు. నేనేమీ పబ్లిక్ అటెన్షన్ కోసమో, పబ్లిసిటీ కోసమో నేను ఇదంతా చేయడం లేదని శ్రీరెడ్డి అన్నారు.

ఆంధ్ర కోసం పోరాటం ఎందుకు? పోలీస్ స్టేషన్ వెళ్లండి పీకేజీ....

పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు.... అలాంటిపుడు పవన్ కళ్యాణ్‌గారు ఆంధ్రా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేయడం ఎందుకు? మీరుకూడా అలాగే వెళ్లండి అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. మీరు ఎలా పోరాటం చేస్తున్నారో మేము కూడా అలాగే ఆందోళన చేస్తున్నాం. కాస్టింగ్ కౌచ్ విషయంలో తెలుగు అమ్మాయిల కోసం మేము పోరాటం చేస్తుంటే మీరు కనీసం రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. అయినా పవన్ కళ్యాణ్ సపోర్టు కావాలని ఎవరూ అడగలేదు. సినిమా ఇండస్ట్రీని చూస్తుంటే సిగ్గేస్తోంది అని శ్రీరెడ్డి అన్నారు.

ఈ విషయంలో మా నాన్న ఉన్నా వదలను: శ్రీరెడ్డి

అమ్మాయిలకు న్యాయం జరిగేందుకు జరుగుతున్న ఈ పోరాటంలో నేను ఎవరినీ వదలను. ఎలాంటి సెంటిమెంట్లు లేవు. నా ఫ్రెండ్, నా ఫేవరెట్ హీరో, చివరకు మా అమ్మ హస్పెండ్(నాన్న) అయినా వదిలి పెట్టేది లేదు అంటూ శ్రీరెడ్డి తేల్చి చెప్పారు.

పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరుగలేదు

అంతకు ముందు ఓ ట్వీట్లో.... పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ స్పందిస్తే అసాంఘిక కార్యకలాపాలపై త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పింది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగలేదని శ్రీరెడ్డి తెలిపారు.

English summary
"I'm not happy wt the pawan kalyan sir's statement..but it's k..talking about other women's protection nd at the same time u kept me down.. I cant understand u,it's fine..I dn hv jealous,nd I am not trying for the public attention or Popularity like any one. Pk ji,why r u doing protest for andra??go to police station or court for special status(joke)..we are also same,u dn hv min respect who r fighting for telugu girl's respect,n independence nd against casting couch..u dn need to open ur mouth forcibly,we can understand ..girls never ever ask pks support..shame on movie industry" Sri Reddy tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X