For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డైరక్టర్ ని కాకపోయి ఉంటే....: పూరీ జగన్నాధ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఒకవేళ మీరు దర్శకుడు కాకుండా రిపోర్టర్ అయితే ఏం చేసేవారు అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ని మీడియావారు ప్రశ్నించారు. ఆయన ఈ ప్రశ్నకు స్పందిస్తూ 'రిపోర్టర్ జాబ్ అస్సలు చేయకపోయేవాణ్ణి. ఎందుకంటే ఎవరి బాధ్యతల్నో మన నెత్తిమీద వేసుకోవడం నాకిష్టముండదు. సామాజిక స్పృహ వుండాలన్న విషయాన్ని కూడా నేను నమ్మను. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత జీవితాల్ని గొప్పగా తీర్చిదిద్దుకుంటే ఆటోమేటిక్‌గ్గా సమాజం బాగుంటుంది. అప్పుడు ఒకరి బాధ్యతల్ని మరొకరు పంచుకోవాల్సిన అవసరం వుండదని నా అభిప్రాయం' అన్నారు.

  అలాగే దర్శకుణ్ణి కాకపోయి వుంటే మాత్రం ఏదైనా హోటల్‌లో సర్వర్‌గా పనిచేసేవాణ్ణి. ఎందుకంటే నాకు భోజనం పెట్టడమంటే చాలా ఇష్టం. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో కృష్ణానగర్‌లోని చౌదరిమెస్ వారింట్లో అద్దెకు వుండేవాడిని. ఖాళీ దొరికితే వారి హోటల్‌లో భోజనం సప్లయ్ చేస్తూ చౌదరి దంపతులకు సహాయం చేస్తుండేవాడిని అని చెప్పుకొచ్చారు.

  దర్శకడుగా తన ప్రయాణం ఎలా మొదలైంది అన్న విషయం వివరిస్తూ...నిజంగా ఈ స్థాయిలో ఉంటానని అనుకోలేదు. నిజానికి దర్శకుడు కావాలనేది నా లక్ష్యం, ఆశయం కానే కాదు. చిన్నప్పుడు సినిమాలు మాత్రం విపరీతంగా చూసేవాన్ని. మా వూళ్లో ఓ టూరింగ్‌ టాకీస్‌ ఉండేది. సినిమా మారేంత వరకూ అదే సినిమా. ఎనిమిదో తరగతిలోనే కథలు రాయడం మొదలుపెట్టా. 'మృదంగం' అనే నాటిక రాస్తే నాన్నగారు చదివారు. 'నువ్వు సినిమాల్లోకి వెళ్తేగానీ బాగుపడవు' అని.. రూ.20 వేలు చేతిలోపెట్టి 'హైదరాబాద్‌ వెళ్లిపో' అని పంపించేశారు అన్నారు.

  ఇక తాను 25 సినిమాల మైలురాయి అందుకొంటారని ఎప్పుడైనా అనుకోలేదంటూ... నేను అనుకోలేదుగానీ... నా మొదటి నిర్మాత అనుకొన్నారు. 'బద్రి' తొలి రోజు షూటింగ్‌ పూర్తి కాగానే ఆ నిర్మాత త్రివిక్రమరావు నా దగ్గరకు వచ్చారు. 'నువ్వు కచ్చితంగా 50 సినిమాలు తీస్తావ్‌' అన్నారు. మొదటి సినిమా అయ్యుండి.. ఓ స్టార్‌ హీరోతో సినిమా చేస్తూ ఎలాంటి ఒత్తిడికీ గురికాకపోవడం ఆయనకు నచ్చుంటుంది. ఆయన చెప్పినట్టు సగం దూరం ప్రయాణించాను అని చెప్పారు.

  పవన్‌కల్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకులముందుకొస్తోంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ 'ఓ రిపోర్టర్‌కు, పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. సమకాలీన రాజయకీయాల ప్రస్తావన వుండదు. ప్రేక్షకులందరూ మెచ్చే అంశాలున్న చిత్రమిది. మీడియా తలచుకుంటే ఎంతటివారినైనా మట్టికరిపించవచ్చనే విషయాన్ని ఈ చిత్రంలో చూపెడుతున్నాను అన్నారు.

  English summary
  
 Pawan Kalyan's craze and super success of Gabbar Singh has generated great buzz for Cameraman Ganga tho Rambabu (CGTR) and has become one of the much awaited movies of the year. The crazy combination of Puri Jagannath - Pawan is coming together after 12 years and has raised the expectations on this racy entertainer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X