పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అంజలి
హైదరాబాద్ : హీరోయిన్ అంజలి మళ్లీ అదృశ్యం అయినట్లు, ఓ రాజకీయ నాయకుడిని పెళ్లాడినట్లు కోలీవుడ్లో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై అంజలి స్పందించింది. తనకు ఎవరితోనూ పెళ్లి కాలేదని వివరణ ఇచ్చింది. ఈ వార్తలు తనను ఎంతో షాక్‌కు గురి చేసాయని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం సినిమాల షూటింగులో బిజీగా ఉన్నానని అంజలి వెల్లడించారు. 'మద గజ రాజా' సినిమా డబ్బింగుకు తాను సహకరించడం లేదనే వార్తల్లో కూడా నిజం లేదని అంజలి స్పష్టం చేసారు. విశాల్ హీరోగా రూపొందిన ఓ తమిళ చిత్రం తెలుగులో 'మద గజ రాజా' పేరుతో సెప్టెంబర్ 6న విడుదలవుతోంది.
ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్, వరలక్ష్మీ, సంతానం ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరో వైపు అంజలి తెలుగులో వెంకటేష్-రామ మల్టీ స్టారర్ 'మసాలా' చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె ఏ ప్రాజెక్టు సైన్ చేయలేదు.
మరో వైపు అంజలి ప్రస్తుతం నటించిన 'మసాలా' చిత్రంతో పాటు, 'మద గజ రాజా' ఇంకా పోస్టు ప్రొడక్షన్ దశలోనే ఉంది. అంజలి అదృశ్యం అయినట్లు వార్తలు రావడంతో ఆందోళనలో పడ్డ చిత్ర నిర్మాతలు...తాను ఎక్కడికీ వెళ్లలేదని ఆమె స్వయంగా వివరణ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications












