రామ్ చరణ్ మాదిరి.... జెండా ఎత్తేసిన శ్రియ!

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెళ్లి వరకు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ ట్విట్టర్లో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. తన షూటింగ్ అనుభవాలను, ఆసక్తికర విషయాలను, ఇతర సంఘటలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వారికి టచ్ లో ఉండే వాడు. ఏమైదో ఏమో తెలియదు కానీ పెళ్లయిన కొద్ది రోజులకే ఉన్నట్టుండి చరణ్ తన ట్విట్టర్ అకౌండ్ క్లోజ్ చేసాడు.

తాజాగా సెక్సీ హీరోయిన్ శ్రియ కూడా రామ్ చరణ్ మాదిరి తన ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసింది. తాను ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణాన్ని కూడా శ్రియ వివరించింది. కొందరు స్టుపిడ్ పీపుల్ అసభ్యమైన కామెంట్స్ పోస్టు చేస్తున్నారని, ఇది తనను ఇబ్బంది పెడుతోందని, అందుకే ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నట్లు శ్రియ ప్రకటించింది.

శ్రియ ప్రస్తుతం తెలుగులో 'పవిత్ర' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె వేశ్య పాత్ర పోషిస్తుంది. జనార్ధన మహర్షి దర్శకుడు. గతంలో పలు సినిమాల్లో సెక్సీగా కనిపించిన శ్రియ ఈ చిత్రంలో మరింత బోల్డ్ గా కనిపించనుంది. స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెప్పే చిత్రం ఇది. నిజాయితీగా ఓ మంచి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇది బోల్డ్ సినిమా అయినా గోల్డ్ లా ఉంటుందని దర్శకుడు అంటున్నారు ఈచిత్ర దర్శక నిర్మాతలు.

మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఏవీఎస్, సాయి కుమార్, శివాజీ, రవిబాబు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానకి సంగీతం: ఎంఎం.శ్రీలేఖ, కెమెరా: విఎన్. సురేష్, ఎడిటింగ్: రమేష్, ఆర్ట్: నాగేంద్రబాబు, నిర్మాతలు: కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి, కథ, దర్శకత్వం: జనార్ధన మహర్షి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X