కమల్ హాసన్‌తో నటించడానికి నో చెప్పిన శృతి హాసన్
హైదరాబాద్: కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఆయనతో నటించడానికి నో చెప్పింది. ఇటీవల 'విశ్వరూపం' చిత్రం భారీ విజయంతో అటు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ అయిన కమల్ హాసన్ త్వరలో 'బిట్టెర్ చాకోలెట్' అనే సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూతురును కూడా తీసుకోవాలని భావించిన ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది.
ఈ చిత్రంలో శృతి హాసన్‌తో కూడా నటింపచేయాలని డిసైడ్ అయిన కమల్ ఆ విషయాన్ని శృతికి చెప్పాడు. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళం ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న శృతి హాసన్ ఆ సినిమాలో నటించడం కుదరదని, తన డేట్స్ ఖాళీ లేవని వెల్లడించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది.
'హాయ్ ట్వీపుల్స్... మా నాన్న తీస్తున్న 'బిట్టర్ చాకొలేట్' చిత్రంలో నేను నటించడం లేదు. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు బాధగా ఉన్నా... డేట్స్ ఖాళీ లేనంత బిజీగా ఉండటం మరో వైపు ఆనందంగా కూడా ఉంది. మరోసారి నాన్న సినిమాలో నటిస్తా' అంటూ ట్వీట్ చేసింది.
శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే... ఆమె ప్రస్తుతం తెలుగు సినిమాలైన ఎవడు, బలుపు సినిమాలతో పాటు, హిందీలో డి డే, రామయ్య వస్తా వయ్యా అనే చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ సినిమాలో అతిథి పాత్ర చేస్తోంది.


Click it and Unblock the Notifications











