'ఆరెంజ్' ప్లాపుకి నేను భాద్యురాలిని కాదు...జెనీలియా
"ఆరెంజ్" జెనీలియా ఇమేజ్‌ను డామేజ్ చేసిందని, ఇక జెన్నీ పని అయిపోయినట్టే అని కొన్ని ఛానల్స్ నా గురించి పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. హిట్ రాగానే అమాంతం నింగికి ఎత్తేయడం, ఫ్లాప్ రాగానే అక్కడ్నుంచి కింద పడేయడం మీడియాకు మామూలే అంటోంది జెనీలియా. అలాగే సినిమా అనేది సమిష్టి కృషి. హిట్టుకీ, ఫ్లాప్‌కీ అందరూ బాధ్యులే. ఒక నటిగా దర్శకుడు చెప్పింది చేయడం నా విధి. ఆ విషయంలో నేను పూర్తిగా న్యాయం చేశాను. అది ప్రేక్షకులకు నచ్చకపోతే..నేను బాధ్యురాలిని ఎలా అవుతాను అని ఎదురు ప్రశ్నిస్తోంది ఆమె.
ఇక హిట్టుకు పొంగిపోవడం, ఫ్లాప్ కు కృంగి పోవడం నాకు తెలీదు. ఏ రంగంలో అయినా ఇవి సహజం అంది. ఇంకా అయినా ఒక్క ఫ్లాప్‌తో తరిగిపోయే క్రేజ్ కాదు నాది. క్రేజ్‌ని బట్టే రెమ్యునరేషన్ కాబట్టి ఆ విషయంలో రాజీపడే పనే లేదు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు కన్నడంలో కూడా సినిమా చేస్తున్నాను. క్షణం ఖాళీ లేకుండా ఉండే నాకు ఫ్లాపుల గురించి ఆలోచించే సమయం ఎక్కడిది అన్నారు అని తేల్చేసింది. ఆరెంజ్ నిర్మాత నాగబాబు ఆ మధ్యన ఆరెంజ్ వల్ల నష్ఠపోవటానికి కారణం జెనిలియా షూటింగ్ మద్యలో హఠాత్తుగా పెంచిన రెమ్యునేషన్ అని కామెంట్ చేసారు. అప్పటినుంచి ఆరెంజ్ విషయం ఎత్తితే ఆమె మండిపడిపోతోంది.


Click it and Unblock the Notifications











