నగ్నంగా నటించడంపై వీణా మాలిక్ స్పందన

By Bojja Kumar

పాకిస్థానీ మోడల్ వీణా మాలిక్ ఆ మధ్య ఎఫ్.హెచ్.ఎం మేగజైన్‌పై నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో రాణించాలనే ఉద్దేశ్యంతో పబ్లిసిటీ పెంచుకోవడంలో భాగంగానే నూలు పోగు కూడా లేకుండా తెగించింది. ఆమె ఊహించినట్లే ఆ తర్వాత పలు బాలీవుడ్ అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం వీణా మాలిక్ బాలీవుడ్‌లో 'జిందగి 50-50' అనే చిత్రంలో నటిస్తోంది. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీణా సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటిస్తోందనే వార్తలు కూడా వినిపించాయి.

నగ్నం నటిస్తుందనే వార్తలపై వీణా మాలిక్ ఎట్టకేలకు స్పందించింది. తాను ఏ సినిమాలోనూ న్నగంగా నటించడం లేదని, నటనకు ప్రాధాన్య ఉన్న పాత్రలను మాత్రమే తాను చేస్తానని తెగేసి చెప్పింది. ఈ చిత్రంలో నేను బ్యాడ్ గర్ల్ పాత్ర పోషిస్తున్నాను. ఆ పాత్ర పూర్తిగా నెగెటివ్‌గా, నటనకు ప్రాధాన్యం ఉండేలా ఉంది. దర్శకుడు వచ్చి అడగ్గానే వెంటనే ఒప్పుకున్నా అని చెప్పింది.

ఈ చిత్రంతో పాటు... ముంబై 125 కి.మీ, ఆల్ యు నీడ్ లవ్, మిస్టర్ మనీ చిత్రాల్లో నటిస్తోంది ఈ పాకిస్థాన్ బ్యూటీ. ఈ బ్యూటీ బరితెగింపు పోకడలపై పాకిస్థాన్‌లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నా...భారత్‌లో మాత్రం ఆమె అందాన్ని ఆరాధించేవారి సంఖ్య పెరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X