నా ‘ఫోర్న్’ కలెక్షన్లపై గర్వపడుతున్నా: వర్మ
ఆయన ఏది మాట్లాడినా వివాదాస్పదమే, ఆయన సినిమాల్లో ఏదో ఒక వివాదస్పద సన్నివేశమో? అశ్లీల సీన్లు ఉండటం కొత్తేమీ కాదు. ఇంగ్లీష్ పరిబాషలో చెప్పాలంటే వర్మ సినిమాల్లో ఫోర్న్(అశ్లీల) సీన్లు తరచూ దర్శనం ఇస్తూనే ఉంటాయి. అయితే రాంగోపాల్ వర్మ మాత్రం వీటిని తనదైన శైలిలో సమర్థించుకుంటున్నారు. సినిమాలు చూసేదే మంచి సంగీతం వినడానికి, అందమైన హీరోయిన్లను చూడటానికి...వాటి ద్వారా ప్రేక్షకులు సంతృప్తిని పొందుతున్నారు. నా సినిమాల్లో అలాంటి ఉన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను అంటూ చెప్పుకొస్తున్నారు. అసలు ఫోర్న్(అశ్లీలం) అనే పదాన్ని ఎలా నిర్వచిస్తారు? అందమైన అమ్మాయిలను అందంగా చూపించడం తప్పా?...నా వరకు మాత్రం నేను వాటిని తప్పుగా భావించడం లేదు, నా ఫోర్న్ కలెక్షన్లను నేను ఎంతో విలువైనవిగా భావిస్తున్నాను అంటూ....కొత్త వివాదానికి తెరలేపారు వర్మ.
ఇదిలా ఉంటే...వర్మ వ్యాఖ్యలపై పలువురు దుమ్మెత్తి పోస్తేన్నారు. ఫోర్న్ చిత్రాలుపై మన దేశంలో నిషేదం ఉంది, అలా మాట్లాడుతున్న వర్మను అరెస్టు చేయాలి అంటూ....కమెంట్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్లపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఇక పోతే...వర్మ తాజా సినిమా 'బెజవాడ" వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. నాగచైతన్య, అమల పాల్ జంటగా రూపొందుతున్న ఈ సినిమా బెజవాడ రౌడీయిజం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు వివేక్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











