‘బెజవాడ దుర్గమ్మ శపించినా’ నేను రెడీ: వర్మ
నాగచైతన్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'బెజవాడ రౌడీలు" టైటిల్ పై ఎన్ని వివాదాలు, ఆందోళనలు చెలరేగాయో కొత్తగా చెప్పనవసరం లేదు. టైటిల్ మార్చే ప్రసక్తే లేదని కొండెక్కి కూర్చున్న వర్మ...బెజవాడ వాసుల ఆందోళనతో చివరకు దిగిరాక తప్పలేదు. ఆ సినిమా టైటిల్ నుంచి 'రౌడీలు" అపదాన్ని కట్ చేసి 'బెజవాడ"గా మార్పు చేశారు.
గతంలో జరిగిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకుంటే....'నా టైటిల్ నా ఇష్టం, బెజవాడ దుర్గమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా.. టైటిల్ మార్చే ప్రసక్తే లేదు" అని తేల్చి చెప్పాడు వర్మ. కానీ దుర్మమీద ఒట్టేసినా మాట నిలబెట్టుకోలేదు. ఒట్టు తీసి గట్టునపెట్టి టైటిల్ మార్చేశాడు. ఇదే విషయంపై వర్మను ప్రశ్నిస్తే 'దుర్గమ్మ శాపాన్ని ఎదుర్కొనడానికి నేను రెడీ" అంటూ సమాధానం ఇచ్చాడు. మరి వర్మకు దుర్గమ్మ ఎలాంటి శాపం ఇవ్వబోతోందో? చూద్దాం.
ram gopal varma bejawada rowdilu naga chaitanya రామ్ గోపాల్ వర్మ బెజవాడ రౌడీలు బెజవాడ దుర్గమ్మ నాగచైతన్య


Click it and Unblock the Notifications