twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దూకడానికైనా, మునిగిపోవడానికైనా సిద్ధం: నాగబాబు స్పీచ్‌తో అభిమానుల్లో గూస్ బంప్స్!

    |

    Recommended Video

    Nagababu Emotional Speech About Pawan Kalyan At Narsapuram || Filmibeat Telugu

    2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొదలు పెట్టినపుడు మాకు ఎవరికీ యాక్సెప్టెన్సీ లేదు. అందుకు కారణం అంతకు ముందు ప్రజారాజ్యం వల్ల జరిగిన చేదు అనుభవమే అని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ఇటీవల ఆయన జనసేన కార్యకర్తల మీటింగులో తన అద్భుతమైన ప్రసంగంతో అభిమానుల్లో ఉత్తేజం నింపారు.

    జనసేన పార్టీ పెట్టినపుడు ఒక అన్నగా.. మా తమ్ముడు ఎందుకు ఇంత కష్టపడాలి? ఎందుకు ఇంత సఫర్ అవ్వాలి అనిపించింది. నేనైతే యాక్సెప్ట్ చేయలేక పోయాను. జనసేన ఫస్ట్ మీటింగ్ జరుగుతున్నపుడు నేను గోవాలో షూటింగులో ఉన్నాను. షూటింగ్ ఆపి కళ్యాణ్ బాబు స్పీచ్ చూశాను. కరెక్టుగా, జెన్యూన్ గా మాట్లాడారు అనిపించింది. కానీ ఎంత వరకు నిలదొక్కుంటాడు అనే డౌట్ అయితే ఉండి పోయిందన్నారు.

    నమ్మకం రావడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది

    నమ్మకం రావడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది

    కళ్యాణ్ బాబు మీద పూర్తి నమ్మకం రావడానికి నాకు రెండున్నర సంవత్సరాలు పట్టింది. ఈ రోజు నేను మనస్పూర్తిగా చెబుతున్నాను... ఇలాంటి లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలి. అలాంటి లీడర్ ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు.

    రాజకీయాలు అంటే అదొక ప్రాఫిటబుల్ ప్రొఫెషన్ అయిపోయింది

    రాజకీయాలు అంటే అదొక ప్రాఫిటబుల్ ప్రొఫెషన్ అయిపోయింది


    ఈ రోజు రాజకీయాలు అంటే అదొక ప్రాఫిటబుల్ ప్రొఫెషన్ అయిపోయింది. ఇండియాలో 80 శాతం అలానే ఉంది. 20 శాతం మంది మాత్రమే ప్రజల కోసం తపించే నాయకులు ఉన్నారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఒక బ్రదర్ గా మాట్లాడటం లేదు.. ఆయనలో నాయకుడిని చూశాను కాబట్టి ఈ మాట అంటున్నా... అన్నారు.

    పవన్ కళ్యాణ్ చెబితే దూకడానికి కూడా రెడీగా ఉండాలి

    పవన్ కళ్యాణ్ చెబితే దూకడానికి కూడా రెడీగా ఉండాలి

    నేను ఎప్పుడూ పార్టీలోకి వస్తాను అనలేదు, పవన్ కళ్యాణ్ కూడా పిలవలేదు. ఓ రోజు నన్ను ఎన్నికల్లో ఎంపీగా నిలబడన్నారు. నిర్ణయం తీసుకోవడానికి నేను 12 గంటలు ఆలోచించి ఉండకూడదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెబితే దూకడానికి కూడా రెడీగా ఉండాలి... అని నాగబాబు తెలిపారు.

    బ్లైండ్‌గా నమ్మాలి

    బ్లైండ్‌గా నమ్మాలి

    నేను కళ్యాణ్ బాబును సంపూర్ణంగా నమ్ముతున్నాను. మనం ఎవరమైనా ఒక నాయకుడిని నమ్మడానికి, నాయకుడిని ఫాలో అవ్వడానికి సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి నమ్మిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. బ్లైండ్ గా ఫాలో అవ్వాలి, అలాంటి ఫాలోవర్స్ ఏ పార్టీలో ఎక్కువగా ఉంటారో ఆ పార్టీ గొప్ప పార్టీ అవుతుంది, ఆ నాయకుడు గొప్ప నాయకుడు అవుతాడని తెలిపారు.

    ఆయన ఏం చెబితే అది చేయాలి

    ఆయన ఏం చెబితే అది చేయాలి

    పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఎలాంటి ప్రశ్నలు లేవు. జనసేనను ఎలా నడపాలి? అని సలహాలు ఇవ్వను. ఆయన ఏం చెబితే అది ఫాలో అయి రిజల్ట్ చూపించే వరకే మనం చేయాలి. ఒక లీడర్ అనే వ్యక్తిని మనం ఫాలో అయితే ఏదైనా జరుగొచ్చు. దానికి ప్రిపేర్ అయినవారే రావాలి. మధ్యలో మాకు కన్వినెంటుగా ఉండాలంటే కష్టం అవుతుందని నాగబాబు వ్యాఖ్యానించారు.

    మునిగిపోవడానికైనా, ఆయనతో కలిసి గెలవడానికైనా సిద్ధం

    మునిగిపోవడానికైనా, ఆయనతో కలిసి గెలవడానికైనా సిద్ధం

    నేను దేనికైనా సిద్ధం, ఆయనతో కలిసి మునిగిపోవడానికైనా, ఆయనతో కలిసి గెలవడానికైనా సిద్ధం. అలాంటి మిలిటెంట్ యాటిట్యూడ్ నాకు ఉంది. నేను జనసేనలో ప్రశ్నించకుండా పని చేస్తాను. నాకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికే ప్రయత్నిస్తాను.... అని నాగబాబు స్పష్టం చేశారు.

    English summary
    Pawan Kalyan's brother Nagababu addressed the Janasena party workers meeting. Nagababu said we should have complete faith in Pawan Kalyan and be ready to do any work for him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X