For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విని షాక్ అయ్యా... ఇలియానా

    By Srikanya
    |

    ఈ మధ్య హిందీ, తమిళ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాను కాబట్టి తెలుగు సినిమాలకు డేట్స్ కేటాయించలేకపోయాను. దాంతో ఇలియానాకి తెలుగులో అవకాశాలు లేవని ప్రచారం చేశారు. ఆ వార్త విని షాక్ అయ్యాను అంటోంది. ప్రస్తుతం ఆమె హిందీ చిత్రం బర్ఫీ లో యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రంలో అవకాశం తెచ్చుకోవడం కోసం ఇలియానా పారితోషికం తగ్గించుకుందనే వార్త ప్రచారంలో ఉంది.. దానిపై ఆమె ఇలా స్పందించింది. అలాగే ఆ షాక్ నుంచి తేరుకునే లోపు అవకాశాలు సంపాదించుకోవడం కోసం ఇలియానా పారితోషికం తగ్గించాలనుకుంటోందని మరో వార్త ప్రచారం చేశారు. టైమ్‌పాస్ కోసం ఇలా రూమర్స్ సృష్టించడం పద్దతి కాదు. ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన సినిమాలు నటిగా నా సత్తా నిరూపించాయి. నాకంటూ మంచి పేరుంది. నా ఆఫర్స్ నాకెప్పుడూ ఉంటాయి. అందుకని పండగలప్పుడు బట్టలు, నగల దుకణాల్లో డిస్కౌంట్లు ఇచ్చినట్లు పారితోషికంలో డిసౌంట్ ఇస్తానంటూ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు అన్నారు. హిందీ 3 ఇడియట్స్ తమిళ రీమేక్ నన్బన్ లో ఇలియానా నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. శంకర్ దర్శకత్వంలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని, ఆయన్నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పింది.

    దాంతో ఇప్పుడు ఇలియానా దృష్టంతా ఈ చిత్రం మీదే. ఎందుకంటే రోబో శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంతోనైనా తన పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలని ఈ గోవా భామ భావిస్తోంది. అందుకనే ఈ చిత్రంలోని పాటలకు బాగా కష్టపడి డ్యాన్స్ చేస్తోందట. ఇలియానా బాలీవుడ్‌లో రణ్‌బీర్‌కపూర్ సరసన 'బర్ఫీ' చిత్రంలో నటిస్తోంది. అలాగే తెలుగులో అల్లు అర్జున్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న త్రీ ఇడియట్స్ చిత్రం సైతం చేస్తోంది. విజయ్, జీవా, శ్రీకాంత్ కాంబినేషన్‌లో శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. అప్పుడు ఇలియానా మాట్లాడుతూ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. అలాగే ముగ్గురు హీరోలూ చాలా ఫ్రెండ్లీగా మెలిగారు. హిందీ 3 ఇడియట్స్ చూశాను. నా నటనలో కరీనా ఛాయలు కనిపించకుండా జాగ్రత్తపడ్డాను. కరీనా చేసినట్లుగానే నేను కూడా యాక్ట్ చేస్తే ఇక సినిమా చేయడమెందుకు, 3 ఇడియట్స్ చూస్తే కరీనా శైలి కనిపిస్తుంది. నన్బన్ నా టైప్‌లో ఉంటుంది అని చెప్పింది.

    English summary
    Ileana is reprising the lead role in the remake of Bollywood’s biggest hit 3-Idiots by reprising the role of Kareena Kapoor in the original.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X