twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లైమాక్స్ అంతా నాపైనే.. రాజమౌళితో అది రూమరే.. నవ్వుకున్నాం.. తమన్నా‘బాహుబలి’ సీక్రెట్స్

    అందాల తార తమన్నా భాటియా ఉత్తరాది అమ్మాయి అయినా బాలీవుడ్‌లో అంతగా గుర్తింపు లేదు. కానీ దక్షిణాది సినీ పరిశ్రమలో తమన్నా అగ్రతార. బాహుబలి చిత్రం తర్వాత ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

    By Rajababu
    |

    అందాల తార తమన్నా భాటియా ఉత్తరాది అమ్మాయి అయినా బాలీవుడ్‌లో అంతగా గుర్తింపు లేదు. కానీ దక్షిణాది సినీ పరిశ్రమలో తమన్నా అగ్రతార. బాహుబలి చిత్రం తర్వాత ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. బాలీవుడ్‌లోనూ బిగ్ స్టార్‌గా హోదా సంపాదించింది. తమన్నా చేసిన అవంతిక పాత్ర బాహుబలి1 సినిమాకు హైలెట్‌గా నిలిచింది. అయితే రెండో భాగానికి సంబంధించిన ట్రైలర్‌లో తమన్నా ఎక్కడ కనిపించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. బాహుబలి2 లోనూ నాది కీలకమైన పాత్రే. క్లైమాక్స్ అంతా నాపైనే ఉంటుంది అని తమన్నా మీడియాతో మాట్లాడుతూ ఆ సినిమాకు సంబంధించిన సీక్రెట్స్‌ను బయటపెట్టింది.

    అందరికీ అదే ఉత్సాహం

    అందరికీ అదే ఉత్సాహం

    బాహుబలి1 తర్వాత రెండేళ్లకు బాహుబలి ది కన్‌క్లూజన్ వస్తున్నప్పటికీ.. ఆ చిత్రంపై ఎలాంటి ఉత్సాహం తగ్గలేదు. మొదటి రోజు ఉన్న ఆసక్తి ఇప్పటికీ కొనసాగతున్నది. బాహుబలి ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడంతో నా అదృష్టం. బాహుబలి సినిమాను అంగీకరించినప్పుడు ఇంత సంచలనం రేపుతుందని అనుకోలేదు. కానీ ఏదో గొప్ప చిత్రం చేస్తున్నామనే ఫీలింగ్ నాతోపాటు అందరికీ ఉండేది. ఎందుకంటే కథ, కథనం అలాంటిది.

    అందుకే రాజమౌళి..

    అందుకే రాజమౌళి..

    దర్శకుడు రాజమౌళి సార్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. సినిమాపరంగా ఆయన కథ చెప్పే తీరు, స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. అందుకే అపజయం లేని, స్థిరమైన దర్శకుడిగా రాజమౌళి పేరు సంపాదించుకొన్నాడు. వందశాతం సక్సెస్ రేటు ఉన్న దర్శకుడు ఆయన. సినీ పరిశ్రమలో ఏ దర్వకుడు సాధించలేని ఘనతను ఆయన సాధించాడు.

    అది సమస్య కానే కాదు..

    అది సమస్య కానే కాదు..

    బాహుబలి2 ట్రైలర్ మరో అద్భుతం. ప్రేక్షకులు పెట్టుకొన్న అన్ని అంచనాలను ట్రైలర్ అధిగమించింది. అందుకే బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌లో నేను ఉన్నానా లేదా అనేది సమస్య కాదు. బాహుబలి1 ప్రోమోలో ఒకే షాట్ ఉంటుంది. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు నా పాత్ర ఏంటో వారికి అర్థమవుతుంది. బాహుబలి సినిమాన నా కెరీర్‌లో ఎంతో మార్పు తెచ్చింది

    బాహుబలికి సమానంగా..

    బాహుబలికి సమానంగా..

    బాహుబలి లాంటి పాత్ర లభించడం నిజంగా వండర్. బాహుబలి పాత్రకు సమానంగా యుద్ధాలు చేయడం, శత్రువులను సంహరించడం లాంటి అంశాలు ఏ యాక్టర్‌కైనా గర్వమే. అలాంటి ఒక్కసీన్ చేసిన.. అలాంటి సినిమాలో భాగమైన అదృష్టమే. బాహుబలిలో అది నాకు దక్కింది.

    ఎలాంటి మార్పులు లేవు..

    ఎలాంటి మార్పులు లేవు..

    బాహుబలి2లోనూ నాది అదే పాత్ర. నా పాత్రలో ఏలాంటి మార్పులు ఉండవు. బాహుబలి2 కోసం మళ్లీ కత్తిసాము, ఫైటింగ్ నేర్చుకొన్నాను. బాహుబలి1 బ్లాక్‌బస్టర్ కావడంతో బాహుబలి2పై భారీగా ఖర్చుపెట్టాల్సి వచ్చింది. చాలా చక్కటి ప్లానింగ్, ఆర్గనైజేషన్‌తో ప్రొడక్షన్ నిర్వహించడం నా కెరీర్‌లో ఇప్పటివరకు చూడలేదు. ప్రతీరోజు రెండు యూనిట్లు పనిచేసేవి. ఒక యూనిట్ ఒక ప్రదేశంలో, రెండో యూనిట్ మరో ప్రదేశంలో షూటింగ్ చేసింది. అలా పద్ధతిగా చేయడం వల్లనే సినిమా త్వరగా పూర్తి అయ్యింది.

     క్లైమాక్స్ నాపైనే..

    క్లైమాక్స్ నాపైనే..

    సినిమాకు కీలకమైన క్లైమాక్స్‌లో నాది చాలా కీలకమైన పాత్ర. క్లైమాక్స్ అంతా నాపైనే ఉంటుంది. క్లైమాక్స్‌లో నేనేంటో తెలుస్తుంది. బాహుబలి1 క్లైమాక్స్‌లో నేను అసలే కనిపించను. కానీ బాహుబలి2లో నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. చెబితే చాలా ఘోరం జరిగిపోతుంది.

     షారుక్ గెస్ట్ అప్పీయరెన్స్..

    షారుక్ గెస్ట్ అప్పీయరెన్స్..

    బాహుబలి2లో షారుక్ అతిథి పాత్రలో నటించాడనేది అవాస్తవం. అందులో నిజం లేదు. అదంతా మీడియా కల్పితమే. బాహుబలి2 సినిమాలో స్పెషల్ అప్పీరియెన్స్ లేవు. నాకు తెలిసినంత వరకు ఇది నిజం. రాజమౌళితో గొడవ పడ్డానని వచ్చిన వార్తలు రూమర్లే. పేపర్లో రాసుకోవడానికి గొప్పగా ఉంటాయి. రాజమౌళి సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికీ నేను అభిమానిస్తాను. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఈ విషయంపై మీడియా బాగా గాసిప్స్ రాసింది. మేము చదువుకొని నవ్వుకొన్నాం.

    కథలో మార్పులేమీ లేవు

    కథలో మార్పులేమీ లేవు

    బాహుబలి1 రిలీజ్ కాకముందే రెండో భాగానికి సంబంధించి చాలా షూట్ చేశాం. అంతేగానీ రీషూట్ చేయలేదు. కథ మార్చలేదు. బాహుబలి1 రిలీజ్ అయ్యే నాటికే బాహుబలి సినిమా కథ అంతా సిద్ధమైంది. రెండో భాగం అద్బుతంగా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగా ఉంటాయి. పాత్రల మధ్య జరిగిన సంఘర్షణ ఏమిటనేది రెండోభాగంలో ఉంటుంది. బాహుబలి1 రిలీజైన తర్వాత కేవలం 30 శాతం మాత్రమే షూట్ చేశాం.

    కట్టప్ప విషయం నాకు తెలుసు

    కట్టప్ప విషయం నాకు తెలుసు

    బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే విసయం బాహుబలి1 రిలీజ్‌కు ముందే తెలిసింది. ఆ విషయం తెలిసిన కొందరిలో నేను ఒక్కరిని. కానీ బాహుబలి2 విడుదలయ్యేంత వరకు ఏమీ మాట్లాడను. కట్టప్ప అంశం బాహుబలి సినిమాపై అంచనాలు పెంచింది. బాహుబలి మొదలైన ఐదు నిమిషాలకే ఆ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.

    అత్యధిక కలెక్షన్లు..

    అత్యధిక కలెక్షన్లు..

    సాధారణంగా కలెక్షన్లు, వసూళ్ల గురించి నాకు ఎక్కువగా తెలియదు. కానీ బాహుబలి1 కంటే బాహుబలి2 ఎక్కువ కలెక్షన్లను రాబడుతుంది. బాహుబలి2 ప్రతీ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురిచేస్తుంది. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా బాహుబలి2 ఖ్యాతిని సంపాదించుకొంటుంది. అదీ మాత్రం నిజం. వాస్తవం.

    బాహుబలి3..

    బాహుబలి3..

    బాహుబలి3 ఉండే అవకాశమే లేదు. రాజమౌళి సార్‌ను చాలా మంది అదే ప్రశ్నను అడుగుతుంటారు. ఆయన చెప్పిన ప్రకారం బాహుబలి2తోనే సిరీస్ ముగుస్తుంది. కాకపోతే కామిక్స్, టెలివిజన్ సిరీస్ లాంటి ఎన్నో వస్తాయి. బాహుబలి సిరీస్ భవిష్యత్‌లోనూ కొనసాగతుుంది. ఇంతటితో ఆగే సమస్య ఉండదు.

    English summary
    The actress Tamannaah Bhatia talks about her role in the film Baahubali, why she’s missing in the trailer, and her much talked-about spat with SS Rajamouli. In this conversation, she talks about her role in the second part, on going missing in the trailer and the obvious ‘Why did Katappa kill Baahubali’ query.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X