'డాన్ శీను' సూపర్ హిట్ అయినా ఖాళీగా ఉన్నానెందుకంటే...
తెలుగులో నా ప్రీవియస్ ఫిలిం డాన్ శీను సూపర్‌హిట్. ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేసి వచ్చిన పేరును చెడగొట్టుకోవడం ఇష్టం లేక తెలుగులో ఏ సినిమా అంగీకరించలేదు. మళ్లీ ఓ మంచి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తా అంటూ చెప్పుకొచ్చింది శ్రియ. అయినా తెలుగులో చేయనంత మాత్రాన ఖాళీగా ఉన్నానని ఎలా ఫిక్సవుతారు...ప్రస్తుతం తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తున్నాను. బాలీవుడ్‌లో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి అంది.అంతేగాక..నా కెరీర్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకూ నేను ఖాళీగా ఉన్న సందర్భమే లేదు. ఎప్పుడూ బిజీగానే ఉన్నాను. కెరీర్‌లో ఎత్తుపల్లాలు లేకుండా ఎవరుంటారు చెప్పండి అంది.ఇంతకీ ఆమె బిజీగా ఉన్నట్లా...ఖాళీగా ఉన్నట్లా..అనేది ప్రక్కన పెడితే...శ్రియ తాజాగా పానీ (నీరు) అనే హిందీ చిత్రంలో కమిటైందైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ డైరక్ట్ చేసే ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్. నీటి కోసం ధనిక, పేద వర్గాల మధ్య జరిగే పోరాటాన్ని ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శ్రియ…సిద్దార్ధ సరసన దీపా మెహతా దర్శకత్వంలో రూపొందే మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే ఇంగ్లిష్ చిత్రంలో, తమిళంలో రౌదిరం, మలయాళంలో కాసనోవా చిత్రాల్లో కనిపించనుంది.


Click it and Unblock the Notifications











