జనీలియాను టూమచ్ గా...(కాబోయే భర్త వ్యాఖ్యలు)
బాలీవుడ్ బబ్లీగర్ల్ జెనీలియా, కేంద్ర మంత్రి కుమారుడైన బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4, 2012న వీరి పెళ్లి తేదీ ఫిక్స్ అయింది కూడా. జనీలియా గురించి రితేష్ తొలిసారిగా మీడియా ముందు నోరు విప్పాడు. నేను టూమచ్ గా జెన్నీని లవ్ చేస్తున్నాను, ఆమె లేకుండా నా జీవితం ఊహించుకోవడం కష్టం అంటూ ఆమెను నెత్తిన ఎక్కించుకున్నాడు. గత 8 ఏళ్లుగా తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది...మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. తుజె మేరీ కసమ్ సినిమా సందర్భంగా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని చెప్పకొచ్చాడు.
ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే తమ వివాహం జరుగుతుందని, పెళ్లి తర్వాత కూడా జెన్నీ సినిమాలో నటించడానికి తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి అభ్యంతరం లేదని రితేష్ స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం తాము పెళ్లి చేసుకుంటున్న విషయం వాస్తవమే. ఫిబ్రవరి 4న అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది, అయితే తామ ఇంకా ఆతేదీని కన్ ఫర్మ్ చేసుకోలేదని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











