హన్సికతో ఆ రాత్రి కాస్సేపే అంతకు మించి...దేవిశ్రీ ప్రసాద్
హన్సికను తొలిసారిగా స్టార్ నైట్ జరిగిన రాత్రే కలుసుకున్నాను..అప్పుడే కొద్దిసేపు మాట్లాడాను..అంతే తప్ప మా మధ్య ఏమీ లేదు అంటున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఆయనను మీకు, హన్సిక మధ్య సంధింగ్..సంధింగ్ నడుస్తోందిట అని చెన్నై టైమ్స్ అనే తమిళ పత్రిక అడిగనప్పుడు ఈ సమాధానమిచ్చాడు. అలాగే మమతా మోహన్ దాస్ కీ తనకీ లింక్ లు పెట్టద్దని కోరాడు. ఆమె నా సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు పాటలు పాడింది అంతే అంతకుమించి కథేమీ లేదు అని తేల్చేసాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే ఈ సంక్రాంతికి తన సంగీత దర్సకత్వం వహించిన అదుర్స్, నమో వెంకటేశ, కుట్టి(ఆర్య రీమేక్) రిలీజ్ అవటం పట్ల యమ హ్యాపీగా ఉందన్నాడు. అలాగే 2009 లో రిలీజైన కరెంట్, ఆర్య-2 పాటలు హిట్టవటం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక తను హీరోగా చేయబోయే చిత్రం మ్యూజికల్ ఎంట్రైనర్ గా ఉంటుందని చెప్పాడు. మంచి స్క్రిప్టు, డైరక్టర్ దొరికిన రోజు ఆ చిత్రం ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చాడు. 2010 సంవత్సరం కూడా అతనికి ఇలాంటి హిట్స్ మరిన్ని ఇవ్వాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











