చిరంజీవి సినిమాలు మిస్సవుతున్నా: విష్ణు
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే కాదు, అటు యూత్ మెచ్చే హీరోయిజం, ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులు కోరుకునే అంశాలు, మంచి సందేశాత్మకంగా వినోదాత్మకంగా ఉండటమే అందుకు కారణం.
ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టి సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన అభిమానుల్లో చాలా మంది మెగాస్టార్ సినిమాలు మిస్సవుతున్నామనే భావనకు లోనవుతున్నారు. నేటికీ చిరంజీవి సినిమాల్లోకి తిరిగి రావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఆయన వీరాభిమానులు ఇలా ఫీలవ్వడం సహజమే. కానీ మోహన్ బాబు తనయుడు, హీరో మంచు విష్ణు కూడా ఇలానే ఫీలవుతుండటం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.
మంచు విష్ణు ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 'చిరంజీవి అంకుల్ ను ఎయిర్ పోర్టులో కలిసాను. ఆయనతో ముచ్చటించడం ఏంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆయన సినిమాలకు దూరం అవ్వడంతో...నా లాంటి మూవీ లవర్స్ ఆయన సినిమాలు మిస్సవుతున్నట్లు ఫీలవుతున్నాం' అంటూ ట్వీట్ చేసారు.
ఇక మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే...
ఇటీవల విష్ణు నటించిన 'దేనికైనా రెడీ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. అయితే సినిమాపై బోలెడు వివాదాలు కూడా నెలకొన్నాయి. ఈచిత్రం తమ సామాజిక వర్గాన్ని కించ పరిచే విధంగా ఉందని బ్రాహ్మణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు.


Click it and Unblock the Notifications











