twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ తో పనిచేసిన ప్రముఖ సినీ దర్శకుడు మృతి

    By Srikanya
    |

    చెన్నై : ప్రముఖ సినీ దర్శకుడు ఐఎన్‌ మూర్తి (89) అనారోగ్యంతో నగరంలో సోమవారం కన్నుమూశారు. తనదైన శైలిలో జేమ్స్‌బాండ్‌ వంటి వరుస చిత్రాలను 1970లో సినీనటుడు జైశంకర్‌తో రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సివిల్‌ ఇంజినీరుగా పని చేసిన ఆయన చెన్నై నగరానికి 1950లో వచ్చారు. ప్రముఖ నటులు సౌందరరాజన్‌, చిత్తూరు వి.నాగయ్య, టీఆర్‌ రామన్నతోపాటు నాటి మేటి నటుడు ఎన్‌టీ రామారావుతో కలిసి సినీరంగంలో పని చేశారు.

    I.N. Murthy Film director dead

    రామారావు నటించిన 'సీతారామకళ్యాణం' చిత్రానికి ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టరుగా వ్యవహరించిన మూర్తి అవార్డులందుకున్నారు. శ్రీవిద్య, మురళీమోహన్‌, గిరిబాబు వంటి నటీనటులను సినీరంగానికి పరిచయం చేసి వారికి సముచిత స్థానం కల్పించారు. అనారోగ్యంతో మరణించిన ఐఎన్‌ మూర్తికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మృతికి సినీరంగానికి చెందిన పలువురు సంతాపం తెలిపారు.

    English summary
    I.N. Murthy, a veteran film director, known for his spy thrillers died in Chennai. He was 89 years old. He collaborated with N.T. Rama Rao as executive director for ‘Seetha Rama Kalyanam’, an award-winning feature.
 Mr. Murthy introduced stars such as Sri Vidya, Muralimohan and Giribabu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X