సైజులు పెంచుకుంటానన్న ఇలియానా
హైదరాబాద్: పోకిరి సినిమాలో ఇలియానా అందాలు చూసి చాలా మంది ఆమెకు అభిమానులు అయిపోయారు. సొగసైన నడుము, అందమైన ముఖార విందానికి తోడు, మంచి ఫిజిక్ తో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. ఆ సినిమా తర్వాత కొంత మంది యువతులు సైతం ఇలియానాలా తయారవ్వాలని చాలా వర్కౌట్లు చేశారు.
స్నేహితుడు సినిమాలో ఒక పాట కోసం దర్శకుడు శంకర్ సూచన మేరకు ఇలియానా సన్నబడిన విషయం మనకు తెలిసిందే. అసలే సన్నగా ఉండే ఆమె మరింత సన్నగా ఉండటంతో ఆ సినిమాలో ఆమెను చుసిన వారందరూ పెదవి విరిచారు. ఇటీవలే ఆమె నటించిన జులాయి, దేవుడు చేసిన మనుషులు సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె మరీ బక్క చిక్కి అలాగే ఉండటంతో అందరూ ఆమెని విమర్శించించడం మొదలు పెట్టారు.
తన గ్లామర్‍పై విమర్శలు వస్తున్నాయన్న విషయం తాజాగా ఆమె చెవిన పడింది. దీంతో బక్క పలుచగా ఉన్న తన బాడీ సైజులు పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల ఓ తెలుగు డైలీతో మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాలో తనపాత్ర కోసమే బరువు తగ్గించుకున్నానని, మళ్లీ బరువు పెరిగి గ్లామర్ గా తయారవుతానని చెప్పింది. మరి ఇలియానా అందాలు పోకిరి, కిక్ సినిమాలోలా మళ్లీ పిటపిటలాడేలా తయారవుతాయో లేదో చూడాలి.
ప్రస్తుతం ఇలియానా నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ బర్ఫీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇక షాహిద్ కపూర్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనున్న 'Phata Poster Nikla Hero' చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా సెలక్టయింది. వన్స్ అపానే టైమ్ ముంబై-2 చిత్రంలోనూ ఇలియానా సెలక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అపీషియల్ సమాచారం వెలువడలేదు.


Click it and Unblock the Notifications











