మహేష్ బాబు 1 నేనొక్కడినే సంక్రాంతికే...
హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు '1 నెనొక్కడినే' సినిమా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దూకుడు' చిత్రం తరువాత మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సంస్థ సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న '1' నేనొక్కడినే.. చిత్రం జనవరి 10న విడుదల కానుంది.

రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా గురించి వారు వివరిస్తూ - 'ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముందు ప్రకటించిన విధంగానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 10న విడుదల చేస్తాం' అన్నారు.
'ఆడియో పెద్ద హిట్ అయింది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మహేశ్ తనయుడు గౌతమ్ చిన్నప్పటి మహేశ్‌గా నటించడం ఈ చిత్రానికి ఒక హైలైట్ పాయింట్. మా బేనర్‌లో ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' వారన్నారు.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.


Click it and Unblock the Notifications











