twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఎన్టీఆర్‌తో రాజకీయాలు మాట్లాడతానా? నెవర్ అంటున్న ఎమ్మెల్యే!

    |

    Recommended Video

    దానికోసం నాన్న,బావ ఉన్నారు...!

    కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే చిత్రం ఈ శుక్రవారం మార్చి 23 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. పేరుకు ఎమ్మెల్యే అయినా ఈ చిత్రం మొత్తం రాజకీయాలకు సంబందించిన కథ ఉండదని కళ్యాణ్ రామ్ చెబుతున్నాడు. కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రం తరువాత ఆ స్థాయి చిత్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎమ్మెల్యే చిత్రంపై సర్వత్రా మంచి బజ్ నెలకొనివుంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాదిస్తుందని కళ్యాణ్ రామ్ నమ్మకంతో ఉన్నాడు. ఎమ్మెల్యే చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో కళ్యాణ్ రామ్ బిజీగా గడుపుతున్నాడు.

    రాజకీయం ఉంది, కానీ

    రాజకీయం ఉంది, కానీ

    ఎమ్మెల్యే చిత్రంలో రాజకీయాలకు సంబందించిన అంశాలని టచ్ చేసామని కళ్యాణ్ రామ్ తెలిపారు. కానీ ఈ చిత్రం పూర్తిస్థాయి రాజకీయ కథ కాదని అన్నారు. రాజకీయ సన్నివేశాలు కూడా సరదాగా చూపించామని కళ్యాణ్ రామ్ అన్నారు.

    డైలాగ్ డెలివరీ మారింది

    డైలాగ్ డెలివరీ మారింది

    ఇటీవల తాను నటించిన చిత్రాలని చూస్తే తన డైలాగ్ డెలివరీలో స్పష్టమైన మార్పుని గమనించవచ్చని కళ్యాణ్ రామ్ అన్నారు. ఎమ్మెల్యే చిత్ర దర్శకుడు ఉపేద్ర గురించి మాట్లాడుతూ.. ఉపేంద్ర రచయిత కూడా. రచయిత దర్శకుడు అయితే రెండు పేజీల డైలాగులు కూడా సింగిల్ లైన్ లోకి మారిపోతాయని అన్నారు.

    ఆ డైలాగ్ ఉద్దేశం అది కాదు

    ఆ డైలాగ్ ఉద్దేశం అది కాదు

    ఇటీవల విడుదలైన ఎమ్మెల్యే చిత్ర ట్రైలర్ లో పవర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి. నేనింకా రాజకీయం చేయడం మొదలుపెట్టలేదు. మొదలుపెడితే మీరు చేయడానికి ఇంకేం మిగలదు అనే డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సూచన కాదని కళ్యాణ్ రామ్ అన్నారు.

    రాజకీయాలపై ఆసక్తి లేదు

    రాజకీయాలపై ఆసక్తి లేదు

    తనకు ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి లేదని కళ్యాణ్ రామ్ తెలిపారు. నటుడిగా, ప్రొడ్యూసర్ గా నేను బిజీగా ఉన్నా. ఈ సమయంలో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని కళ్యాణ్ రామ్ అన్నారు. రాజకీయాలు తన బావ చూసుకుంటారని నారా లోకేష్ గురించి వ్యాఖ్యానించారు. తన తండ్రి హరికృష్ణ కూడా రాజకీయాల్లో ఉన్నారని కళ్యాణ్ రామ్ అన్నారు.

    ఎన్టీఆర్ తో రాజకీయాలా

    ఎన్టీఆర్ తో రాజకీయాలా

    తన సోదరుడు ఎన్టీఆర్ తో ఉన్న బంధం గురించి కూడా కళ్యాణ్ రామ్ వివరించారు. ఎన్టీఆర్ తో తాను రాజకీయాల గురించి మాట్లాడడం అస్సలు జరగదని కళ్యాణ్ రామ్ అన్నారు. తాము కేవలం సినిమాలు గురించి మాత్రమే మాట్లాడుకుంటామని కళ్యాణ్ రామ్ తెలిపాడు.

    ఇది ఆ వయసు కాదు

    ఇది ఆ వయసు కాదు

    తాను, ఎన్టీఆర్ కలసి రాజకీయాలు మాట్లాడుకునే వయసు తమది కాదని కళ్యాణ్ రామ్ తెలిపారు. తాము ఇంకా యువకులమే అని అభిప్రాయపడ్డారు. కొత్త కార్లు, కొత్త వస్తువుల గురించి కూడా నేను, ఎన్టీఆర్ మాట్లాడుకుంటాం అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

    సాయిధరమ్ తేజ్ తో మల్టిస్టారర్

    సాయిధరమ్ తేజ్ తో మల్టిస్టారర్

    ఆ మధ్యన కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ లతో మల్టీస్టారర్ చిత్రానికి బీజం పడింది. కానీ ఆ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. దర్శకుడు కథని పూర్తిగా వివరించలేదని అందువలనే ఆ చిత్రం ఆగిపోయినట్లు కళ్యాణ్ రామ్ తెలిపాడు. కానీ తాను మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటానని అన్నారు.

    తొలిసారి రొమాంటిక్ చిత్రం

    తొలిసారి రొమాంటిక్ చిత్రం

    ఎమ్మెల్యే చిత్రం తరువాత కళ్యాణ్ రామ్ నటించిన నా నువ్వే చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. తాను చేస్తున్న తొలి రొమాంటిక్ చిత్రం ఇదే అని కళ్యాణ్ రామ్ అభిప్రాయపడ్డారు.

    English summary
    I never discuss politics with NTR. We discuss about films only
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X