twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందులో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాను.. అదంటే నాకిష్టం, ఇంటి రాగానే అమల..: నాగ్

    |

    తనయుల్ని హిట్ ట్రాక్ ఎక్కించాలని నాగార్జున చాలానే తాపత్రయపడుతున్నారు. హీరోగా తన కెరీర్‌ పట్ల సంతృప్తిగా ఉన్న ఆయన.. తనయుల కెరీర్ విషయంలో మాత్రం ఇంకా ఆ సంతృప్తిని పొందలేదు.

    Recommended Video

    హలో మూవీ రివ్యూ, ప్రేక్షకుల స్పందన !

    తాజాగా అఖిల్ హీరోగా నటించిన 'హలో' చిత్రం హిట్ కోసం ఆయన తనవంతుగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విరివిగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. డిసెంబర్ 22న హలో విడుదల సందర్భంగా అన్నపూర్ణ సెవన్ ఏకర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం ఆయన మాటల్లోనే..

    'బేబీ డెలివరీ', అది బిగ్ సర్‌ప్రైజ్!, ఇక నావల్ల కాదని.. కొత్త విషయం చెప్పిన నాగ్'బేబీ డెలివరీ', అది బిగ్ సర్‌ప్రైజ్!, ఇక నావల్ల కాదని.. కొత్త విషయం చెప్పిన నాగ్

     హిట్‌.. ఆ నమ్మకముంది:

    హిట్‌.. ఆ నమ్మకముంది:

    ఈ సినిమాకి సంబంధించి అన్నీ ప్రెస్‌మీట్లలో నేనే మాట్లాడుతున్నా. మా ప్రొడక్షన్ లో చివరి మూడు సినిమాలకీ నేనే మాట్లాడాను. లక్కీగా అవన్నీ సక్సెస్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్‌ అవుతుందన్న నమ్మకం వుంది.

     విక్రమ్‌కు థ్యాంక్స్:

    విక్రమ్‌కు థ్యాంక్స్:

    ముందుగా నేను విక్రమ్‌కి ఫస్ట్‌ థాంక్స్‌ చెప్పుకోవాలి. ఎందుకంటే నాన్నగారి లాస్ట్‌ సినిమా 'మనం'. అలాంటి గొప్ప చిత్రాన్ని మాకు ఇచ్చారు. మళ్ళీ బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరితో 'హలో' చిత్రాన్ని ఫెంటాస్టిక్‌గా తెరకెక్కించారు.

     కసితో చేశాడు:

    కసితో చేశాడు:

    అఖిల్‌ సినిమా కాబట్టి ఆ ప్రేమ ఇంకాస్త పెరిగింది. బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరితో అఖిల్‌కి 'హలో' వంటి ఫీల్‌గుడ్‌ సినిమాని నిర్మించినందుకు గర్వంగా ఉంది. అఖిల్‌ సంవత్సరం పాటు కష్టపడి సిన్సియర్‌గా ఈ సినిమా చేశాడు.

    తను బేసిగ్గా అథ్లెట్‌ కాబట్టి విక్రమ్‌ అఖిల్‌తో జంపింగ్‌, డైవ్‌ అన్నీ చక్కగా చేయించుకున్నాడు. మంచి హిట్‌ కొట్టాలి అన్న కసితో అఖిల్‌ ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఈ చిత్రం చేశాడు.

     నా ఇన్వాల్వ్‌మెంట్?:

    నా ఇన్వాల్వ్‌మెంట్?:

    ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్‌ అయ్యాక నా జోక్యం ఏమీ వుండదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌లో బాగా ఇన్‌వాల్వ్‌ అవుతాను. అదంటే నాకు ఇష్టం. సినిమా కలర్‌ఫుల్‌గా, క్వాలిటీగా రావాలని చూస్తాను. అందుకోసం టెక్నీషియన్స్‌కి ఎక్కువ టైమ్‌ ఇస్తాను.

    వారిని గైడెన్స్‌ చేస్తూ టైమ్‌ సెన్స్‌ చెప్తూ చేశాం. అప్పుడే మంచి సినిమా వస్తుంది. విక్రమ్‌ టీమ్‌ అంతా ఈ చిత్రాన్ని క్రియేటివిటీతో బాగా చేశారు. ఈ సినిమా క్రెడిట్‌ అంతా విక్రమ్‌కే చెందుతుంది.

     ఆ మ్యాజిక్ ఉంటుంది:

    ఆ మ్యాజిక్ ఉంటుంది:

    హలో' సినిమా చూశాను. నాకు అఖిల్‌ని ఎలా చూడాలనుకున్నానో అలా ఈ చిత్రంలో చూశాను. ఈ సినిమా డెస్టినీ మీద నడుస్తోంది. అలాగే చిన్న మ్యాజిక్‌ ఉంటుంది. అదేంటి అనేది సినిమా చూడాలి. విక్రమ్‌ సినిమాల్లో ఆ మ్యాజిక్‌ ప్రతిసారి వుంటుంది.

    ప్రియదర్శన్‌ లిజి కూతురు కళ్యాణి ప్రియదర్శన్‌ని స్క్రీన్‌ టెస్ట్‌ చేసి మూడు నెలలు ట్రైనింగ్‌ ఇచ్చి ఈ సినిమాలో సెలెక్ట్‌ చేశాం. ఫెంటాస్టిక్‌గా చేసింది. ఈ సినిమా తర్వాత మంచి ఫ్యూచర్‌ వుంటుంది.

     చిరంజీవి.. రెండు నిమిషాలు మౌనంగా

    చిరంజీవి.. రెండు నిమిషాలు మౌనంగా

    చిరంజీవిగారిని సినిమా చూసి ఆ తర్వాత ఫంక్షన్‌కి వచ్చి తన అభిప్రాయం చెప్పమన్నాను. ఆయన సినిమా చూశాక అఖిల్‌ని గట్టిగా హగ్‌ చేసుకుని రెండు నిమిషాలు మౌనంగా వుండిపోయారు.

    ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. అంతగా సినిమాకి కనెక్ట్‌ అయ్యారు. ఆయన రియాక్షన్‌ చూశాక టెన్షన్‌ అంతా పోయి రిలాక్స్‌గా వున్నాను. చరణ్‌, అఖిల్‌ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌. ఒక బ్యూటిఫుల్‌ బేబిని ప్రేక్షకుల్లో వదిలాం. ఫైనల్‌ రిజల్ట్‌ వారి చేతిలో వుంది.

     న్యూ ఏజ్ బాయ్:

    న్యూ ఏజ్ బాయ్:

    గీతాంజలి' 'శివ' కంటే ముందు నేను చాలా సూపర్‌హిట్‌ సినిమాలు చేశాను. కానీ నాగార్జున బాగా చేశాడు అని ఎవరూ అనలేదు. 'గీతాంజలి'లో నా లుక్‌, నా స్టైల్‌ పర్‌ఫెక్ట్‌గా ఆ క్యారెక్టర్‌ నాకు సెట్‌ అయ్యింది.

    అందరూ నాగ్‌ బాగా చేశాడు అన్నారు. 'హలో'తో అఖిల్‌ ఏజ్‌కి సూట్‌ అయ్యే క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశాడు. ఇప్పుడు అఖిల్‌ న్యూ ఏజ్‌ బోయ్‌. సాంగ్స్‌, సీన్స్‌, యాక్షన్‌ సీన్స్‌లలో అఖిల్‌ని అద్భుతంగా ప్రజెంట్‌ చేశాడు విక్రమ్‌.

    యాక్షన్ సీక్వెన్స్ హైలైట్:

    యాక్షన్ సీక్వెన్స్ హైలైట్:

    ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హాలివుడ్‌ నుండి బాబ్‌ బ్రౌన్‌ స్టంట్‌ డైరెక్టర్‌ని తీసుకొచ్చాం. ఆయన హాలీవుడ్‌ టెర్నినేటర్‌ సిరీస్‌ సినిమాలు చేశాడు. చైనీస్‌, కొరియా చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేశాడు. అతని కోరిక ఇండియన్‌ ఫిలిం చెయ్యాలని. ఒక ఫ్రెండ్‌ ద్వారా అతనికి స్క్రిప్ట్‌ మెయిల్‌ చేశాం.

    అతనికి నచ్చి వెంటనే ఇండియాకి వచ్చి ఈ సినిమా ఫైట్స్‌ కంపోజ్‌ చేశాడు. సెపరేట్‌ ఫైట్స్‌లా కాకుండా చాలా ఎగ్జైటింగ్‌గా వుంటాయి. లవ్‌స్టోరిలో యాక్షన్‌ పెట్టడం చాలా కష్టం. అలాంటిది ఈ చిత్రం సిట్చ్యుయేషన్‌కి తగ్గట్లుగా యాక్షన్‌ సీన్స్‌ కుదిరాయి.

     అమల.. డ్యాన్స్ చేస్తోంది:

    అమల.. డ్యాన్స్ చేస్తోంది:

    అమల ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా వుంది. ఇంటికి రాగానే నా చుట్టూ డ్యాన్స్‌ చేస్తుంది. ఈ హ్యాపీ మూమెంట్స్‌ అన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వుంది. అమల వారి అమ్మగారికి తెలుగు రాదు. అయినా మూడుసార్లు చూసింది. మళ్ళీ చూస్తానంటోంది. మనవడు మీద ప్రేమ చాలా ఎక్కువ వుంది.

    English summary
    Akkineni Nagarjuna is putting a lot effort to bright his children (Naga Chaitanya and Akhil)'s careers in Tollywood. Recently he talked to media on Hello movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X