'రచ్చ' గురించి మళ్ళీ రామ్ చరణ్ రచ్చ
అది బైక్ రైడింగ్ కావచ్చు.. ప్రమాదకరమైన స్టంట్స్ అవ్వొచ్చు.. హార్స్ రైడింగ్ లేదా స్కై డైవింగ్ ఏదైనా నాకు డూప్ లని పెట్టి చేయటం ఇష్టం ఉండదు. ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ అయినా నేనే స్వయంగా చేస్తాను అంటున్నారు రామ్ చరణ్. రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఓ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఇలా స్పందించారు. రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చ గురించి ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నాడు.
పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగు ఇటీవల శ్రీలంకలో చిత్రీకరించారు. రామ్ చరణ్ తో బాటు తమన్నా పాల్గొన్న ఈ షూటింగులో రెండు పాటలను, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు.


Click it and Unblock the Notifications











