అతన్ని కలవడానికి నిరాకరించలేదు: దీపిక
బాలీవుడ్ హాట్ బేబీ దీపిక పడుకొనె రేస్-2 చిత్రం నుంచి అర్దాంతరంగా తప్పుకోవడంతో ఆ సినిమా నిర్మాత రమేష్ తౌరాని....ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో ఆమెపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన వద్ద అడ్వాన్స్ తీసుకున్న దీపిక సినిమాలో నటించక పోగా, తనను కలవడానికి నిరాకరిస్తుందని సదరు నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తౌరానీ చేస్తున్న ఆరోపణలను దీపిక ఖండించింది. ఆయన చెబుతున్నవి పచ్చి అబద్దాలు, ఆ సమయంలో నేను ఇండియాలో లేను, అందుకే తన మేనేజర్లను కలవమని సూచించాను. ఆ రోజు నేను ఉదయం 7 గంటలకు ఇండియాలో దిగాను. 9 గంటలకు 'కాక్ టెయిల్' సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఉండటంతో వెళ్లాను. షూటింగ్ అయిపోయాక కలుస్తానని చెప్పాను, కానీ ఆయన వినకుండా సెట్స్ లోకి వచ్చాడు. అప్పుడు తౌరానికీ అన్ని విషయాలు వివరించాను అని చెబుతోంది.
వివాదానికి కారణం ఇదీ..
నిర్మాత రమేష్ తౌరాని తాను నిర్మిస్తున్న రేస్-2 చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన దీపిక 6 రోజులు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత సినిమా నుంచి తప్పుకుందని, దీని వల్ల తాను ఎంతో నష్ట పోతానని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె రేస్-2 సినిమాలో నటించాలని రమేష్ తౌరాని డిమాండ్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి తప్పకోవడంలో దీపిక తప్పేమీ లేదని, నిర్మాత ఆమెతో అగ్రిమెంట్ కుదుర్చుకునే సమయంలో సెప్టెంబర్ 2011లోపు సినిమా పూర్తవుతుందని చెప్పారని, ఇప్పుడు మనం ఫిబ్రవరి 2012లో ఉన్నాం. అయినా సినిమా పూర్తి కాలేదు. అందుకే సినిమా నుంచి తప్పకుందని దీపిక సన్నిహితులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











