Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
తేల్చేసిన బండ్ల: రోజాను అందుకే అన్నాను.., అలా చేస్తే కాళ్లు పట్టుకుంటా?
Recommended Video
ఒకరేమో ఫైర్ బ్రాండ్.., ఇంకొకరు.. అభిమానంలో 'నాకు నేనే పోటీ' అనుకునేంతటి పవన్ కల్యాణ్ ఫ్యాన్. ఇద్దరి మధ్య చిచ్చు పుడితే అది ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి వీరిద్దరి మధ్య జరిగిన టీవి9 డిబేట్ చూస్తే అర్థమవుతుంది.
పలకడానికి.. రాయడానికి కూడా వీలు లేని రీతిలో ఈ ఇద్దరూ చర్చ కార్యక్రమాన్ని రచ్చబండ పంచాయితీ కింద మార్చేశారు. తాము ఆరాధించే వ్యక్తిని గౌరవం లేకుండా మాట్లాడారని బండ్ల గణేష్.. రాజకీయాల్లో విమర్శలు తప్పవని రోజా.. మొత్తానికి హద్దులు దాటి జనం 'హవ్వా' అనుకునేలా చేశారు.
పోనీ.. ఆ తర్వాతైనా దీనికి ఫుల్ స్టాప్ పడిందా? అంటే అదీ లేదు. ఆ చర్చ కార్యక్రమం అనంతరం కూడా వీరిద్దరి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.
ఏ ప్రాంతమైనా.. నేను అభిమానిని!
'నేను మహిళలను ఎప్పుడూ ఏ మాటా అనలేదు. పవన్ కల్యాణ్‌ని వాడు, వీడు అంటూ ఎమ్మెల్యే రోజా మాట్లాడారు కాబట్టే.. నేను ఆమెను అలా అన్నాను. నేను ఏ ప్రాంతం వాడినయినా పవన్ కల్యాణ్ అభిమానినే. ఆయనను ఏమన్నా అంటే నాకు కోపం రాదా?' అని సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్ అన్నారు.
రెచ్చగొడితేనే.. అలా అన్నాను
పవన్ కల్యాణ్ తనకు దైవ సమానం అని బండ్ల గణేష్ మరోసారి స్పష్టం చేశారు. 'నాకు పవన్ కల్యాణ్ దైవ సమానం, ఆయనేంటో ఆయన క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. ఎందుకమ్మా పవన్ కల్యాణ్‌ని వాడు, వీడు అంటున్నావని రోజాను అడిగాను.. దానికే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఆమె అన్నాకే నేను కూడా రోజాని అలా అన్నాను.'
' వైసీపీలో ఇంతమంది మహిళా నేతలు ఉన్నారు ఎవరైనా రోజాలా చెడుగా మాట్లాడుతున్నారా?, వాసిరెడ్డి పద్మగారూ ఎంతో బాగా మాట్లాడతారు. రోజా మాట్లాడే మాటల వల్ల వైసీపీ పార్టీయే నష్టపోతోంది. రోజా నన్ను రెచ్చగొడితేనే అలా అన్నాను' అని బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. మొత్తానికి రోజా రెచ్చగొట్టడం వల్లే తానూ 'టంగ్ స్లిప్' అవాల్సి వచ్చిందని బండ్ల గణేష్ చెప్పారు.
క్షమాపణ చెప్పను
'ఒక మహిళా నేత మరో నేతను పట్టుకుని వాడు వీడు అనడం సరైందేనా?, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం న్యాయమా? నన్ను అరెస్టు చేయాలని వైసీపీ నేతలు అంటున్నారు. నేను చేసింది తప్పని చట్టంలో ఉంటే నేను చట్టాన్ని గౌరవిస్తాను. రోజాగారు నోరు జారారు కాబట్టే నేను అలా మాట్లాడాను. ప్రాణం పోయినా నేను ఆమెకి క్షమాపణ చెప్పను. ఒకవేళ పవన్‌కి రోజా క్షమాపణ చెబితే నేను రోజా కాళ్లు పట్టుకోవడానికైనా సిద్దం' అని బండ్ల గణేష్ తేల్చి పారేశారు.
బండ్లపై కమిషనర్‌కు ఫిర్యాదు:
రోజాపై అనుచిత వ్యాఖ్యలకు నిర్మాత బండ్ల గణేష్ ను అరెస్ట్ చేయాలని వైసీపీ మహిళా నేత బండి పుణ్యశీల ఆధ్వర్యంలో విజయవాడ కమిషనర్ కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ మరోసారి వివాదంపై స్పందించారు. రోజా వల్లే తాను మాట జారాను తప్ప.. అది తన స్వీయ తప్పిదం కాదనేది ఆయన వాదన. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ధైర్యం ఉంటే ఫోన్ స్విచ్చాన్ చేయాలంటూ సవాళ్లూ విసురుతున్నారు. చూడాలి మరి.. ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో!..