»   » వినాయకుడిపై మరోసారి తన కామెంట్స్‌తో రెచ్చిపోయిన వర్మ

వినాయకుడిపై మరోసారి తన కామెంట్స్‌తో రెచ్చిపోయిన వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన రీతిలో రెచ్చిపోయారు. దురహంకారంతో ఉన్న తనను జెంటిల్, స్వీట్, దేవుడంటే భయం భక్తి ఉండే మనిషిగా మార్చు అంటూ గణేషుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేసాడు. అంతే కాదు...గణేషుడి ఆశీర్వాదం ఉంటే సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయి. ఆగ్ రీమేక్ కూడా హిట్టవుతుంది అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసాడు.

వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ తన రహస్య స్నేహితుడు, దీర్ఘకాల అభిమాన దేవుడు అయిన వినాయకుని దీవెనలు అందరికీ అందాలని ఆకాంక్షిస్తూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై వర్మ స్పందించాడు. 'విష్ణూ! నీ రహస్య స్నేహితుడు, అభిమాన దేవుడు ఎవరో అందరికీ తెలియనివ్వకు, ఎందుకంటే అలా తెలిస్తే...తిరుపతి, యాదగిరిగుట్ట దేవుళ్లు అసూయపడతారు. నిన్ను శపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు' అంటూ వర్మ ట్వీట్ చేశాడు.

I pray Ganesha to change me: RGV

దేవుడంటే నమ్మకం లేని రామ్ గోపాల్ వర్మ.... కావాలనే వినాయకుడిపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. గతేడాది కూడా రామ్ గోపాల్ వర్మ వినాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యానించాడంటూ కేసులు పెట్టడం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు కూడా చెప్పాడు.

English summary
"I pray Ganesha to change me from an eccentric arrogant bastard to a gentle,sweet n extremely God fearing human being" RGV Tweeted.
Please Wait while comments are loading...