Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ భగవంతుడ్ని ఒకటే కోరుకుంటున్నానంటున్న స్టార్ హీరోయిన్
మన సంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా పండగలు జరుపుకోవడం అంటే మహా ప్రీతి. సినిమాల్లోకి రాకముందు అన్ని పండగలూ జరుపుకునేదాన్ని. అయితే ఒక్కోసారి షూటింగ్స్ ఉండటంవల్ల పండగలు మిస్ అవుతున్నాను. లక్కీగా ఈసారి షూటింగ్ లేదు. అందుకని ముంబయ్ వెళ్లాను. సంక్రాంతి పండగను చాలా గ్రాండ్‌గా జరుపుకుంటున్నాం. మా పంజాబీలం సంక్రాంతి పండగను 'లోరి" అంటాం.
లోరీనాడు పోటీలు పడి మంటలు వేస్తాం. సరదా కోసం మొదలుపెట్టే ఈ మంటల తతంగం చివరికి పోటీగా మారుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద మంట వేస్తే అంత బాగా లోరీ చేసుకున్నట్లు. ఇంకో విషయం ఏంటంటే.. మంటల్లో పేలాలు, బియ్యం, నువ్వులు వేస్తాం. ఇక సంక్రాంతికి 'ముగ్గులు" సందడి ఎలానూ ఉంటుంది.
మా అమ్మ నువ్వుల లడ్డు, గారెలు, చక్రపొంగలి చేస్తుంది. అవన్నీ ఇష్టంగా లాగించేస్తా. ఇక పండగ సందర్భంగా ఆ భగవంతుడ్ని ఒకటే కోరుకుంటున్నా. నా చెల్లెలు నిషా, నా కెరీర్ ఇంకా బ్రైట్‌గా ఉండాలని, మాకు ఇంకా గుర్తింపు రావాలని ఆశిస్తున్నా. అలాగే అందరి జీవితాలూ ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను.