నా నటనకు మణిరత్నం ప్రశంసలే మరువలేనివి: షీలా
మస్కా, పరుగు, అదుర్స్ వంటి స్టార్స్ చిత్రాల్లో నటించినా షీలాకు అవకాశాలు మాత్రం రావటం లేదు. అయితే ఆ విషయాన్ని దాచి పెట్టి ఆమె మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నా అని బిల్డప్ లిస్తోంది. అంతేగాక తనను మర్చిపోకుండా మీడయోలో ఏదో రకంగా మాట్లాడుకోవటానికి స్టేట్ మెంట్స్ ఇస్తోంది. తాజాగా ఆమె తన నటనకు మణిరత్నం ప్రశంసలు అందించారని, ఆ కాంప్లిమెంట్స్ జీవితాంతం మరిచిపోలేనంది. ఇంతకీ ఏ సినిమాకి తల్లి అంత గొప్ప దర్శకుడుని మై మరిపించిన నటనా అని అడిగితే 'డుం..డుం..డుం' అనే సినిమా అని చెప్పింది. అందులోనూ అని నోరు వెళ్ళబెట్టితే..అవును అందులో నేను చైల్డ్ ఆర్టిస్టును..అప్పట్లో నా గురించే అంతా మాట్లాడుకున్నారు. మణిసార్ అయితే ప్రత్యకంగా నన్ను మెచ్చుకుని పెద్ద య్యాక పెద్ద స్టార్ వి అవుతావన్నారు అని చెప్పింది కళ్ళు తిప్పుతూ. ఇక జీవితాశయం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోవటమని అంది.ఇక సినిమా దగ్గరకు వస్తే ప్రస్తుతం తాను మళయాళంలో ఓ అద్బుతమైన చిత్రంలో చేస్తున్నానని,దానిపేరు మ్యాకప్ మేన్ అనీ,అందులో తాను స్టార్ హీరోయిన్ గా చేస్తున్నానని,హీరో జయరాం మ్యాకప్ మేన్ గా చేస్తున్నాడని అంది. అంతేతప్ప తెలుగులో ఎందుకు ఆఫర్స్ రావటంలేదనేది మాత్రం చెప్పటం లేదు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











