ఎఫైర్ రూమర్స్, పర్సనల్ అంటూ తాప్సి రుసరుస
హైదరాబాద్: హీరోయిన్ తాప్సీపై ఇటీవల రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తాప్సీ ఆ హీరోతో డేటింగ్ చేస్తోంది, ఈ హీరోతో క్లోజ్‌గా ఉంటోందనిఅంటూ .....మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటీవల ఆమె షట్లర్ Mathias Boeతో ట్విట్టర్లో టచ్‌లో ఉండటంపై కూడా ఇద్దరి మధ్య ఏదో లింక్ ఉందంటూ వార్తలు వెలువడ్డాయి.
అయితే ఇలాంటి వార్తలపై తాను స్పందించాల్సిన అవసరం లేదని, నాకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి, నా పర్సనల్ విషయాల గురించి మీడియాతో మాట్లాడటం నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటూ తాప్సీ రుసరుసలాడింది. ఆ వార్తలను ఖండించక పోగా... తాప్సి ఇలా మాట్లాడటంతో ఆశ్చర్య పోయారు.
తాప్సి సినిమాల విషయానికొస్తే....ఇటీవల ఆమో తమిళంలో నటించిన 'ఆరంభం' చిత్రం మంచి విజయం సాధించింది. అయితే తెలుగులో మాత్రం ఈచిత్రానికి పెద్దగా ఆదరణ దక్కలేదు. మిస్టర్ పర్ ఫెక్ట్ తర్వాత తాప్సి తెలుగులో నటించిన ఏ చిత్రం కూడా విజయం అందుకోలేదు.
దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ప్రస్తుతం తమిళం, హిందీ చిత్ర సీమలపై దృష్టి సారించింది. తమిళంలో ముని-3, వాయ్ రాజా వాయ్, హిందీలో రన్నింగ్ షాది డాట్ కామ్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications












