పవన్‌తో పోటీ: 14న శంకర్ ‘ఐ’ (అఫీషియల్ ప్రెస్ నోట్)
హైదరాబాద్: చియాన్ విక్రమ్ కథానాయకుడుగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ధీటుగా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ‘ఐ' చిత్రం ఆడియో సోని మ్యూజిక్ ద్వారా డిసెంబర్ 30న విడుదలై సంగీత ప్రియుల నుండి మంచి స్పందన సొంతం చేసుకుందని, ఎక్కడ చూసినా ‘ఐ' పాటల జోరే ఉందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
ఈ భారీ విజువల్ వండర్‌ని ఆస్కార్ ఫిలింస్ వి.రవిచంద్రన్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రై.లి అధినేతలు కలిసి సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అన్ని పనుల్ని పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ సరసన యామీ జాక్సన్ కథానాయికగా నటించింది.

సురేష్ గోపి, ఉపేన్ పటేల్, సంతానం, రాంకుమార్ గణేషన్, శ్రీనివాసన్, సయ్యద్ సిద్ధిక్ మొదలైన వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్.
పవన్ కళ్యాణ్-వెంకటేష్ సిినిమాకు ‘గోపాల గోపాల’కు పోటీగా ‘ఐ’ చిత్రం విడుదల కావడం చర్చనీయాంశం అయింది. మరి ఈ పండగ సీజన్లో ఏ సినిమా బాక్సాఫీసు కలెక్షన్లు కొల్లగొడుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సొంత సినిమాలను కాదని పరాయి సినిమాలంటూ వివాదం...
పండగ సమయాల్లో డబ్బింగ్ చిత్రాలను అనుమతించకూడదనే నిబందనలు ఉన్నా పట్టించుకోకుండా ‘ఐ' సినిమా విడుదలకు తెలుగు ఫిల్మ్ చాంబర్ అనుమతి ఇశ్వడంపై పలువురు చిన్న నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఐ' లాంటి పెద్ద సినిమాలు ఎప్పుడు విడుదలైనా నడుస్తాయి. పండగ సీజన్లో ఇతర చిన్న సినిమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











