»   » బోనీ కపూర్ తిట్లు: శ్రీదేవి తొడల గురించి మళ్లీ వర్మ ట్వీట్లు!

బోనీ కపూర్ తిట్లు: శ్రీదేవి తొడల గురించి మళ్లీ వర్మ ట్వీట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో వార్తల్లో వ్యక్తిగా ఉండేవాడు. కానీ ఇపుడు సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఆయ‌న ‘గ‌న్స్ అండ్ థైస్'(గన్స్ మరియు తొడలు) పేరుతో త‌న ఆత్మ‌క‌థ రాస్తున్నాడు. ఈ బ‌యోగ్ర‌ఫీలో ఆయ‌న సంచ‌ల‌న విష‌యాలు బయట పెట్టడంతో పాటు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యనాలు కూడా చేసారు.

ఇప్ప‌టికే ఈ బుక్‌ని అమితాబ్‌, ఊర్మిత‌తోపాటు ప‌లువురి గ్యాంగ్‌స్ట‌ర్స్‌, పోర్న్ స్టార్ అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు వర్మ. ద‌ర్శ‌కుడిగా తాను ఎంట్రీ ఇవ్వ‌డానికి అమితాబ్‌, శ్రీదేవే కార‌ణ‌మ‌ని చెప్పాడు వ‌ర్మ‌. దీవార్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ గ‌న్‌ని, హిమ్మ‌త్‌వాలాలో శ్రీదేవి తొడ‌ల‌ను చూసి ఇన్‌స్ప‌యిర్ అయ్యి డైరెక్ట‌ర్ అవ్వాల‌ని క‌ల‌లు క‌న్నాన‌ని వివ‌రించాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

ఈ పుస్తకంలో శ్రీదేవిపై రాసిన చాప్టర్ ఆమెకు తాను రాసిన ప్రేమలేఖ లాంటిదని, ఆమె పట్ల తనకున్న ఆకర్షణ ఒక డ్రగ్స్‌ లాంటిందంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. బోనీ కపూర్ కిచెన్ లో శ్రీదేవి టీ పెడుతుండటం చూసి విస్మయానికి గురయ్యాను. దివిలో ఉన్న ఓ దేవతను తన అపార్ట్ మెంట్ లోని కిచెన్ స్థాయికి దించేసిన బోనీ కపూర్ ను నేను ఎప్పటికీ క్షమించను అని వర్మ పుస్తకంలో రాసాడు.

అయితే వర్మ తీరుపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ మండి పడ్డారు. రామ్ గోపాల్‌ వర్మ ది వెర్రి మనస్తత్వం, వికృత మనస్తత్వం అంటూ బోనీ విరుచుకుపడ్డారు. పబ్లిసిటీ కోసమే అతను ఇలా చేస్తున్నట్లు బోనీ ఆరోపించారు. అయితే బోనీ కపూర్ రియాన్ పై ట్విట్టర్ ద్వారా తనదైన రీతిలో స్పందించారు వర్మ.

బోనీ కపూర్ నాపై విమర్శలు చేసే ముందు ‘గన్స్ అండ్ థైస్' పుస్తకం పూర్తిగా చదవాలని సూచించాడు వర్మ. భర్తగా బోనీ కపూర్ శ్రీదేవికి ఇచ్చే రెస్పెక్ట్ కంటే ఒక అభిమానిగా నేను ఇచ్చే రెస్పెక్టే గొప్పదని వర్మ పేర్కొన్నాడు. శ్రీదేవి అంత పాపులర్ కావడానికి కేవలం ఆమె యాక్టింగ్ కెపాసిటీ మాత్రమే కాదు...ఆమె అందమైన తొడలు కూడా కారణమని వర్మ చెప్పారు. కేవలం యాక్టింగు టాలెంటుతో స్టార్ డమ్ వస్తుందనుకుంటే స్మితా పాటిల్ శ్రీదేవి కంటే ఎందుకు పెద్ద స్టార్ కాకపోయింది. శ్రీదేవి అందమైన తొడలే ఆమెను పెద్ద స్టార్ ను చేసాయి. శ్రీదేవి తొడలు, ఆమె నవ్వు, ఆమె యాక్టింగ్ టాలెంట్, ఆమె సెన్సివిటీ అన్నింటినీ నేను గౌరవిస్తాను అని వర్మ పేర్కొన్నాడు.

బోనీ కపూర్ పూర్తిగా చదువు...

బోనీ కపూర్ నాపై విమర్శలు చేసే ముందు ‘గన్స్ అండ్ థైస్' పుస్తకం పూర్తిగా చదవాలని సూచించాడు వర్మ.

రెస్పెక్ట్

భర్తగా బోనీ కపూర్ శ్రీదేవికి ఇచ్చే రెస్పెక్ట్ కంటే ఒక అభిమానిగా నేను ఇచ్చే రెస్పెక్టే గొప్పదని వర్మ పేర్కొన్నాడు

కారణం అదే

శ్రీదేవి అంత పాపులర్ కావడానికి కేవలం ఆమె యాక్టింగ్ కెపాసిటీ మాత్రమే కాదు...ఆమె అందమైన తొడలు కూడా కారణమని వర్మ చెప్పారు

స్మితా పాటిల్ కాలేదే...

కేవలం యాక్టింగు టాలెంటుతో స్టార్ డమ్ వస్తుందనుకుంటే స్మితా పాటిల్ శ్రీదేవి కంటే ఎందుకు పెద్ద స్టార్ కాకపోయింది.

రామ్ గోపాల్ వర్మ

శ్రీదేవి అందమైన తొడలే ఆమెను పెద్ద స్టార్ ను చేసాయి. శ్రీదేవి తొడలు, ఆమె నవ్వు, ఆమె యాక్టింగ్ టాలెంట్, ఆమె సెన్సివిటీ అన్నింటినీ నేను గౌరవిస్తాను అని వర్మ పేర్కొన్నాడు.

English summary
“My advise to Boney is to read my full article in "Guns and Thighs" on Srideviji before spewing venom on me. If only acting talent is a measure for stardom why was'nt Smita Patil bigger than Srideviji..The thunder thighs made the difference. I respect Srideviji for her thighs,her smile,her acting talent,her sensitivity,her persona and above all I respect her love for Boney,” RGVt weeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu