సూరి హత్యతో షాక్‌కు గురయ్యా: వర్మ
మద్దెలచెర్వు సూరి మృతదేహాన్ని చూసి చలించిపోయానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మంగళవారం తన ట్విట్టర్‌లో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సూరి మృతి దేహం నన్ను కలిచి వేసిందన్నారు. ఏడాది కాలంగా సూరితో తనకు పరిచయం ఉందని ఆయన పేర్కొన్నారు. రక్తచరిత్ర పరిశోధన కోసం తాను సూరిని కలిసినట్టుగా చెప్పారు. రామ్ గోపాల్ వర్మ, పరిటాల రవి, మద్దెలచెర్వు సూరిల నేపథ్యంలో రక్త చరిత్రాన్ని రెండు భాగాలుగా తీసిన విషయం తెలిసిందే. కాగా సూరి హత్యపై రక్త చరిత్ర చిత్ర నటులు వివేక్ ఒబేరాయ్, సూర్యలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
రామ్ గోపాల్ వర్మ మద్దెలచెర్వు సూరి వివేక్ ఒబెరాయ్ సూర్య ram gopal varma maddelacheruvu suri vivek oberoi surya


Click it and Unblock the Notifications