twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాడ్ ప్రామిస్: చిరంజీవిపై నోరు జారా...నన్ను క్షమించండి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిపై ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవికి ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన ఇలా మాట్లాడటం మెగా అభిమానులకు కోపం తెప్పించింది. ఈ కామెంట్స్ తర్వాత సినీ వర్గాల నుండి కూడా ఆయనపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.

    అటు చిరంజీవి అభిమానులు, ఇటు సినీ ఇండస్ట్రీ వారు ముప్పేట చుట్టు ముట్టడంతో కోదండరామిరెడ్డి దిగివచ్చారు. ఆ రోజు ఏదో నోరు జారాను... నన్ను క్షమించాలంటూ తాజాగా ఓ ప్రకటన చేసారు. చిరంజీవి, రామ్ చరణ్, వివి వినాయక్ తనను ఎక్స్ క్యూజ్ చేయాలని కోరారు.

    'నేను ఆ రోజు మాట్లాడిన దానికి సిన్సియర్ గా సారీ చెబుతున్నాను. ఆ రోజు నేను నాకు తెలియకుండానే నోరు జారాను. గాడ్ ప్రామిస్... ఆ సమయంలో నేను అలా ఎందుకు మాట్లాడానే నాకే తెలియదు. చిరంజీవి గారితో నేను ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసారు. మా ఇద్దరి మధ్య ఇప్పటికీ మంచి రిలేషన్ ఉంది. హిట్స్, ప్లాపులు డిసైడ్ చేయడానికి నేనేమీ దేవుడిని కాదు. ఏలాంటి సినిమా అయినా సక్సెస్, ఫెయిల్లూర్ విషయంలో కామెంట్ చేయడానికి నేను ఎవరిని? ఆ రోజు ఏదో అనుకోకుండా తప్పుగా మాట్లాడాను. మీడియా మిత్రుల ముందు చెబుతున్నాను... చిరంజీవిగారు, రామ్ చరణ్, వివి వినాయక్ మరియు మెగా అభిమానులను తనన్ను ఎక్స్యూజ్ చేయాలని కోరుతున్నాను' అంటూ కోదండరామిరెడ్డి ప్రకటించారు.

    మెగా అభిమానుల కోపానికి కారణమైన కోందండరామిరెడ్డి కామెంట్స్ ఏమిటో స్లైడ్ షోలో..

    నవ్వుకుంటారు..

    నవ్వుకుంటారు..

    ‘చిరంజీవి యాక్షన్‌, సందేశాత్మక సినిమాలు తీస్తే జనం నవ్వుకుంటారు.... తానైతే చిరంజీవితో హాస్య చిత్రం తీస్తానంటూ కోదండరామిరెడ్డి కొన్ని రోజుల క్రితం కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

    150వ చిత్రంపై..

    150వ చిత్రంపై..

    చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం అలానే ఉంటుందని భావిస్తున్నానని కోదండరామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కోదండరామిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

    అంతా షాక్

    అంతా షాక్

    కోదండరామిరెడ్డి చిరుపై ఇలాంటి వ్యాఖ్యలు ఏ కారణంతో చేశారో తెలియక అంతా షాక్ అచ్యారు.

    ఊహించలేదు

    ఊహించలేదు

    చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు అప్పట్లో సూపర్‌హిట్ అయ్యాయి. చిరు ఎక్కువ సినిమాలు ఒకే డైరెక్టర్‌తో తీసిన లిస్ట్‌లో కోదండరామిరెడ్డి అందరికన్నా ముందుంటారు. అలాంటి వ్యక్తి చిరుపై ఇలాంటి కామెంట్స్ చేస్తారని ఎవరూ ఊహించలేదు.

    అనేక డౌట్స్

    అనేక డౌట్స్

    కోదండరామిరెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడంతో చిరుకు, కోదండరామిరెడ్డికి వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. దీంతో ప్రేక్షకుల్లో అనేక డౌట్స్.

    పరువు తీసారు

    పరువు తీసారు

    చిరూ రీ ఎంట్రీని ఎద్దేవా చేస్తూనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటారనే టాక్ వినిపించింది. పైగా పొలిటికల్‌గా చిరు విఫలమయ్యారని, అందువల్ల ఆయన సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం నమ్మరన్న కోణంలోనే కోదండరామిరెడ్డి ఈ కామెంట్స్ చేసారి అంతా అనుకున్నారు.

    సారీ చెబితే మచ్చ పోతుందా?

    సారీ చెబితే మచ్చ పోతుందా?

    చేయాల్సిందంతా చేసి...మాట్లాడాల్సిందంతా మాట్లాడి ఇపుడు సారీ చెబితే జనాలు ఆ విషయం మర్చిపోతారా?

    English summary
    ‘I sincerely feel sorry for what I have spoken. I do not know how but I slipped the words in a flow. God promise, I was not aware of what I was telling. I made many super hit films with Chiranjeevi and we both share a beautiful bond till today. I am not a god to decide about hits and flops. Who am I to comment on success and failure of a film in any genre? I committed a mistake by speaking wrongly. In front of media friends, I request Chiranjeevi, Ramcharan, VV Vinayak and Fans to excuse me,’ said A Kodanda Rami Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X