ధైర్యం ఉంటే ముందుకు రారా.. చెప్పుతో కొడుతా.. ఫ్యామిలీని అంటే చంపేస్తా.. మంచు లక్ష్మీ

By Rajababu

Recommended Video

Manchu Lakshmi Prasanna Makes Serious Comments To Media

టాలీవుడ్‌లోనే కాకుండా టెలివిజన్ ఇండస్ట్రీలో మంచు లక్ష్మీ తనదైన ముద్రతో రాణిస్తున్నారు. నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా, హోస్ట్‌గా విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. అంతకంటే ముందు గృహిణిగా చక్కటి బాధ్యతను పోషిస్తున్నారు. సౌమ్యతకు మంచి పేరున్న మంచు లక్ష్మీ ఇటీవల నెటిజన్లపై ఫైర్ అయ్యారు. ఇంటర్నెట్‌లో తనను, తన కుటుంబాన్ని రకరకాలుగా ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫ్ ఆఫ్ రామ్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా లక్ష్మీ మంచు మాట్లాడుతూ తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు.

ట్రోల్స్ నా దృష్టికి వస్తుంటాయి

ట్రోల్స్ నా దృష్టికి వస్తుంటాయి

సోషల్ మీడియాలో నాపై కామెంట్లు చేస్తూ ట్రోల్ చేయడం నా దృష్టికి వస్తుంటాయి. వాటిలో కొన్నింటిని ఎంజాయ్ చేస్తుంటాను. నా వ్యక్తిగత ప్రతిష్ట, జీవితానికి భంగం కలుగకుండా, నా కుటుంబ పరువు తీయకుండా ఉండే వరకు నాకు ఓకే అని మంచు లక్ష్మీ అన్నారు.

వాళ్లను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది

వాళ్లను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది

అలా కాకుండా నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ యూట్యూబ్‌లో మా ఫోటోలు, వీడియోలు పెట్టి, మార్ఫింగ్ చేసి వాళ్లను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి రా. నా గురించి, నా ఇంటి సభ్యుల గురించి ఎవడికి ఏమి తెలుసు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాంటివి పట్టించుకోను కానీ

అలాంటివి పట్టించుకోను కానీ

నేను మాట్లాడే మాటలను, నా బట్టల గురించి, నా మాట తీరు గురించి మాట్లాడితే ఓకే. నేను పెద్దగా పట్టించుకోను. అందంతా మీడియా గేమ్‌లో భాగమే. అది కాకుండా నా ఫ్యామిలీ గురించి బుద్ధి తక్కువగా మాట్లాడితే ఊరుకొను.

నా ఫ్యామిలీని అంటే చంపేస్తా

నా ఫ్యామిలీని అంటే చంపేస్తా

ఒకవేళ నా ఫ్యామిలీ ప్రతిష్టపై బురద చల్లే విధంగా వ్యవహరిస్తే సింహంలా మారుతాను. వారిని చంపాలనిపిస్తుంది. అందులో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. మా ఫ్యామిలీ వినోద రంగంలోనే కాకుండా ప్రజాసేవలో ఉన్నాం. మాకు కొన్ని పట్టింపులు ఉంటాయి. చవకబారు వ్యాఖ్యలకు కూడా ఓ హద్దు ఉంటుంది.

ఇతరు జీవితాల్లోకి చూడొద్దు

ఇతరు జీవితాల్లోకి చూడొద్దు

సోషల్ మీడియాతో కొన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువగానే భంగం కలుగుతున్నది. ప్రతీ ఒక్కరు ఇతరుల జీవితాల్లోకి చూడాలనే ప్రయత్నం జరుగుతున్నది. అందరిలానే మేము మా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని అనుకొంటాం. ఒకరిని తప్పు పట్టే హక్కు మరొకరికి ఎవరిచ్చారు అని నిలదీశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X