6వ క్లాసులోనే... డైరెక్టర్ కూతురు డేటింగ్
ముంబై: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ కూతురు అలియా భట్ తండ్రి వారసత్వంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తెరంగ్రేటం చేసిన అలియా భట్ తొలి సినిమాతోనే బోలెడు గుర్తింపు తెచ్చుకుంది.
దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహిస్తున్న 'కాఫీ విత్ కరణ్' అనే టీవీ రియాల్టీ షోలో పాల్గొన్న అలియా భట్....తన లైఫ్‌లోని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. '6వ తరగతి చదవేప్పుడే తాను డేటింగ్ మొదలు పెట్టానని, అయితే అది నిజమైన డేటింగ్ కాదు. క్లాస్ రూంలో ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకునే వాళ్లం' అని వెల్లడించింది.

అలియా భట్ కరణ్ జోహార్ చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది. కరణ్ జోహార్.. ధర్మా ప్రొడక్షన్, షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ లపై తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అక్టోబర్ 19న విడుదలయ్యింది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రం పెద్దగా ఆడయక పోయినా... స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు కావడంతో అలియా భట్‌కు మరిన్ని అవకాశాలు దక్కాయి.
ప్రస్తుతం ఆమె ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 'హైవే' చిత్రంలో, అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో '2 స్టేట్స్' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు 'హమ్‌ప్తీ శర్మ దుల్హనియా' చిత్రంలో కూడా నటించబోతోంది. హైవే చిత్రానికి ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ తనకంటే వయసులో చాలా పెద్దవాడైన రణదీప్ హుడాతో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 21, 2014న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
2 స్టేట్స్ చిత్రానికి అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్ నడియా వాలా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అర్జున్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











