twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాత్రిళ్ళు నిద్రపోకపోవటమే లావు అవటానికి కారణం అంటోంది

    By Srikanya
    |

    బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్యాబాలన్ తనకు ఒళ్ళు రావటానకి కారణం తను రాత్రిళ్ళు సరిగా నిద్రపోకపోవటమేనంటూ తేల్చింది. అయితే ఈ నిద్రపట్టని సమస్య తనకు పన్నెండవ ఏట నుంచి ఉందని అప్పట్లో కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్నని అదే తన మెటబాలిజాన్ని దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చింది. అయితే మూడేళ్ళ క్రిందట ఈ విషయం తనకు తెలిసిందని చెప్పింది. ఇక తన ఒళ్ళు గురించి మీడియాలో వార్తలు వచ్చినప్పుడల్లా బాధకలిగేదని,అయితే లావు తగ్గటం కోసం తాను చాలా కష్టపడ్డానని అయితే ఫలితం లేకుండాపోయిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో పూజ మకీజా అనే డైటీషన్ దగ్గరకు వెళితే ఆవిడ నా అలవాట్లు తెలుసుకుని అప్పుడు నిద్రపోకపోతే వచ్చే సమస్యలు చెప్పి, తనను మార్చిందని అప్పటినుంచి రాత్రిళ్ళు ఎక్కువ సేపు పడుకోవటానికి ప్రయత్నిస్తున్నాని అంది.

    అయితే హఠాత్తుగా ఈ నిద్రగోల ఎత్తుకోవటానకి కారణం ఆమె స్లీపింగ్ ఎవేర్ నెస్ మంత్ కి బ్రాండ్ అంబాసిడర్ కావటమే. ప్రస్తుతం విద్యాబాలన్..సిల్క్ స్మితగా డర్టీ పిక్చర్ లో నటిస్తోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మిలింద్ లూద్రియా డైరక్ట్ చేస్తున్నాడు. ఇందులో నసీరుద్దీన్ షా..విద్యాబాలన్ ని వివాహం చేసుకునే నిర్మాతగా కనిపించనున్నారు. ఎక్కువ భాగం చెన్నైలోనూ, ముంబైలోని కొన్ని స్టూడియోల్లోనూ షూట్ చేస్తారు. ఈ 'ది డర్టీ పిక్చర్‌' చిత్రం కోసం విధ్యాబాలన్ ఆ మధ్య పశ్చమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చి వెళ్ళింది. అజయ్ దేవగన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

    English summary
    Vidya Balan, who was tackling weight issues sometime ago, feels the primary reason behind it was insomnia and said she is still trying to overcome the sleeping disorder.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X