నేను ఇక మాస్ హీరోను : ప్రెస్ మీట్లో నాగచైతన్య
హైదరాబాద్ : నాగ చైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా ప్రధాన పాత్ర ధారులుగా డాలీ దర్వకత్వంలో రూపొందిన 'తడాఖా' చిత్రం సూపర్ హిట్టయిందంటూ...ఆ చిత్ర యూనిట్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో కథానాయకులు నాగచైతన్య, సునీల్, చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకుడు డాలి, కమెడియన్ శ్రీనివాస రెడ్డి, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ...సినిమా అంతటా మంచి టాక్ వస్తోంది. నన్ను లవ్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్‌కి తీసుకెళ్లిన సినిమా ఇది. సునీల్ మంచి సపోర్ట్ ఇచ్చారు. తమన్ మ్యూజిక్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్, డాలీ దర్శకత్వం సినిమాను పెద్ద హిట్ చేసాయి అన్నారు. సినిమాను విజయవంతం చేసిన అందరికీ నాగ చైతన్య కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు డాలీ మాట్లాడుతూ...సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయని ఫోన్లు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...సునీల్ మాస్ చిత్రంలో నాగార్జునకు తమ్ముడుగా చేసాడు. ఇందులో నాగ చైతన్యకి అన్నగా చేసాడు. నాగచైతన్య-సునీల్ కాంబినేషన్ బాగా కుదిరింది. సునీల్‌ను తీసుకోవాలన్న నాగార్జున సూచన బాగా వర్కౌట్ అయింది అన్నారు.

తడాఖా చిత్రం సక్సెస్ మీట్

సునీల్, నాగ చైతన్య చిట్ చాట్

మాట్లాడుతున్న నాగ చైతన్య

సినిమానుహిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్న నిర్మాత బెల్లంకొండ


Click it and Unblock the Notifications











