ట్రైలర్ రికార్డ్: నేడు ‘ఐ’ తెలుగు ఆడియో రిలీజ్
హైదరాబాద్: విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఐ' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం తమిళ వెర్షన్ ఆడియో విడుదల కాగా, తెలుగు వెర్షన్ ఆడియో నేటి(డిసెంబర్ 30) సాయంత్రం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్ హయత్ హోటల్ లో ఆడియో వేడుక జరుగనుంది.
కాగా...ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదలైన కేవలం 8 రోజుల్లోనే యూట్యూబులో 5 మిలియన్ హిట్స్ సొంతం చేసుకుంది. అత్యధిక హిట్స్ సొంతం చేసుకున్న ట్రైలర్ గా ఈ ట్రైలర్ రికార్డు సృష్టించింది. అత్యధిక మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాగా కూడా ఈ చిత్రం టాప్ పొజిషన్లో ఉంది.

దర్శకుడిగా ఇంత వరకూ ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇపుడు చియాన్ విక్రమ్ హీరోగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ధీటుగా ‘ఐ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ ఫిలింస్ అధినేత వి.రవిచంద్రన్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ విజువల్ వండర్‌ను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైలిమిటెడ్ సంస్థ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చియాన్ విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈచిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.


Click it and Unblock the Notifications











