పవన్ ని మొదటిసారి అక్కడ కలిసా: రేణు దేశాయ్

By Srikanya

I thank Puri for making Pawan my life: Renu Desai
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె రీసెంట్ గా బద్రీ చిత్రం విడుదలై 14 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ట్విట్టర్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

మొదటిగా బద్రీలో ఆమెకు నచ్చిన డైలాగు గురించి అభిమాని ప్రశ్నిస్తే... ఆమె స్పందిస్తూ..ఈ రింగ్ ఎంత బాగుంది ఇది నాకు ఇచ్చిన డైలాగు. హోటల్ లో సరయుని కలిసినప్పుడు వచ్చే సన్నివేశంలో నేను చెప్పే డైలాగు ఇది. అలాగే నాకు క్లైమాక్స్ సీన్ బాగా నచ్చింది. ఆ సన్నివేశంలో నాకు ఒక్క డైలాగు కూడా లేదు.

ఇక పవన్ సినిమాల్లో నచ్చిన సినిమా గురించి చెప్పమంటే ఆమె స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ చూసాను. ఆయనకు వీరాభిమానిని అన్నారు. అత్తారింటికి దారేది చిత్రం కూడా చూసాను అన్నారు.

అలాగే బద్రి చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి చెప్తూ...నా కెరీర్ లో మంచి సినిమా అందించిన పూరీ జగన్నాథ్ కి ఎప్పుడూ ధాంక్స్ చెప్తాను. అంతేకాదు పవన్ నా జీవితంలోకి తీసుకువచ్చినందుకే కాకుండా పవన్నే నా జీవితంగా చేసినందుకు కూడా అని ఆమె అన్నారు.

అలాగే బద్రి గురించి మరిన్ని విషయాలు చెప్తూ...నేను సరయు పాత్రకు, సిమ్రాన్ ని వెన్నెల పాత్రకు అనుకున్నారు. అయితే సిమ్రాన్ కు డేట్స్ ప్లాబ్లం రావటంతో నేను వెన్నెల పాత్ర చేసాను...మిగతా అంతా మీకు తెలుసు అన్నారు.

ఇక 6 జూన్ 99 న నేను పవన్ కళ్యాణ్ ని మొదటి సారి రామానాయుడు స్టూడియో లో కలిసాను. అప్పుడు ఆయన తమ్ముడు చిత్రం షూటింగ్ క్లైమాక్స్ లో ఉన్నారు. దాదాపు 15 సంవత్సార క్రితం అని గుర్తు చేసుకున్నారు.

పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు.

రేణు దేశాయ్ నిర్మాతగా మారి 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం విడుదలైంది. సమీర్ జోషి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈచిత్రంలో స్వప్నిల్ జోషి, ముక్తా బార్వే, సాయి తమ్హాంకర్ ముఖ్య పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X