twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత బండ్ల గణేష్ సెటిల్ మెంట్ కు నయీం లింక్, ప్రాణహాని ఉన్నా

    By Srikanya
    |

    హైదరాబాద్: నటుడు సచిన జోషి వద్ద గణేశ రూ. 20 కోట్లు అప్పు తీసుకున్నారని, ఆ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతుంటే సచిన ఈ విషయాన్ని నయీం దృష్టికి తీసుకెళ్లాడన్నారు. గణేశ నుంచి నయీం రూ. 8.5 కోట్లు వసూలుచేసి సచినకు ఇచ్చాడని పేర్కొన్నారు. తాను చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తానని, ఇవి కావాలని చేస్తున్న ఆరోపణలు కాదని నట్టి కుమార్‌ అన్నారు.

    అలాగే ... సినిమా నిర్మాతలు సి. కల్యాణ్‌, బూరుగుపల్లి శివరామకృష్ణ, అశోక్‌కుమార్‌, బండ్ల గణేశ, నటుడు సచిన జోషికి నయీం ముఠాతో సంబంధాలున్నాయని నట్టి కుమార్‌ ఆరోపించారు.

    నట్టికుమార్ మాట్లాడుతూ...నాకు ప్రాణహాని ఉందని తెలుసు. అయినా బయటకు వచ్చి ఇవన్నీ చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. నయీముద్దీన బాధితుల్లో తానూ ఉన్నానని సినీ నిర్మాత నట్టి కుమార్‌ వెల్లడించారు. అంతేగాక చిత్రసీమలోని కొంతమంది నిర్మాతలకు నయీం అండదండలున్నాయని ఆరోపిస్తూ వారి పేర్లను బహిర్గతం చేశారు. తనకు ప్రాణహాని ఉన్నా నిజాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ విషయాల్ని వెల్లడిస్తున్నానన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

    I too was threatened by Nayeem: Nattikumar

    శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేటలో తాను లీజు తీసుకున్న వెంకటేశ్వర మహల్‌ థియేటర్‌ను రెండు నెలల క్రితం నయీం ముఖ్య అనుచరుడు జగ్గిరెడ్డి మనుషులు బలవంతంగా లాగేసుకున్నారని, థియేటర్‌ను తమకు అప్పగించాలని అజీజ్‌రెడ్డి, ఆసిఫ్‌ అనేవాళ్లు తనకు ఫోన చేశారని, తాము 'భాయ్‌' మనుషులమని తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు.

    మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి చెందిన గెస్ట్‌హౌ్‌సలో నయీం అనుచరులు ఉన్నారని, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. కళ్లముందే నయీం అనుచరులు తిరుగుతున్నా పోలీసులు ఎందుకు చర్య తీసుకోవడం లేదో అర్థంకావట్లేదని అన్నారు.

    ఇక డీఎస్పీ సహా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వాళ్లు కేసు నమోదు చేయలేదన్నారు. దాంతో న్యాయం కోసం తాను హైకోర్టుకు వెళ్లానని చెప్పారు. ఉత్తరాంధ్రలోని అత్యధిక థియేటర్లలో క్యాంటిన బిజినెస్‌ అంతా జగ్గిరెడ్డి అధీనంలోనే నడుస్తోందని, ఆయన బాధితుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు.

    English summary
    Tollywood producer Natti Kumar stated that noted producer Bandla Ganesh had a debt of Rs 20 crore to pay to Mr Sachin Joshi, but when he failed to pay, Mr Joshi approa-ched Nayeem and he collected Rs 8.5 crore from Ganesh..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X