కాళ్లు మొక్కిన రాశీ ఖన్నా, ఆమె మేనేజర్ టార్చర్ పెట్టాడంటూ... దిల్ రాజు సెన్సేషన్!

By Bojja Kumar

Recommended Video

Srinivasa Kalyanam Movie Team Interview శ్రీనివాస కళ్యాణం టీం ఇంటర్వ్యూ

నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' చిత్రం ఆగస్టు 9న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం సినిమా గురించి చిట్ చాట్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. రాశీ ఖన్నా రెమ్యూనరేషన్ విషయంలో జరిగిన ఓ ఇంట్రస్టింగ్ ఇష్యూను సైతం నిర్మాత దిల్ రాజు బయట పెట్టారు. నితిన్, రాశీ ఖన్నా రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణకు సంబంధించి తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు.

 అక్కడ వద్దు బాబోయ్ అనుకున్నా, కానీ అదిరిపోయింది: నితిన్

అక్కడ వద్దు బాబోయ్ అనుకున్నా, కానీ అదిరిపోయింది: నితిన్

‘మొదలవుదాం తొలి ప్రేమగా..అపుడో ఇపుడో ఎపుడైతేనేం కొత్తగా' అనే సాంగ్ చిత్రీకరణ అరకులో ప్లాన్ చేశారు. అరకులో షూటింగ్ అనగానే ముందు అక్కడ వద్దురా బాబూ అనుకున్నాను. కానీ సమీర్ గారు కన్విన్స్ చేశారు. మార్నింగ్ 5.30కి ఫస్ట్ షాట్ తీశారు. నా కెరీర్లో టాప్ మోస్ట్ గుడ్ క్వాలిటీ సాంగ్ అది, చాలా బాగా వచ్చింది' అని నితిన్ తెలిపారు.

ఆ రొమాంటిక్ సాంగుతో ప్రేక్షకలు రిలాక్స్ అవుతారు: దిల్ రాజు

ఆ రొమాంటిక్ సాంగుతో ప్రేక్షకలు రిలాక్స్ అవుతారు: దిల్ రాజు

‘ఆ సాంగ్ రాగానే సతీష్‌కు చెప్పాను... చూడు ఎంత బావుందో అని, ఇలాంటి పెళ్లి హడావుడి మధ్యలో ఓ చిన్న రొమాంటికల్ సాంగ్ ఆడియన్స్ కు కూడా రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుందని నా నమ్మకం' అని దిల్ రాజు తెలిపారు.

నా కెరీర్లో బెస్ట్ సాంగ్

నా కెరీర్లో బెస్ట్ సాంగ్

స్క్రీన్లో ఈ సాంగ్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా కనిపించింది. షూట్ చేసినపుడే ఇది సూపర్‌గా ఉంటుందని అనిపించింది. నా కెరీర్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్... అని రాశీ ఖన్నా తెలిపారు.

రాశీ చెత్తగా ఉందని తిట్టుకుంది: నితిన్

రాశీ చెత్తగా ఉందని తిట్టుకుంది: నితిన్

రాశీ ఖన్నా అలా అనగానే.... నితిన్ రియాక్ట్ అవుతూ ‘ఫస్ట్ ఈ సాంగ్ ట్యూన్ రాగానే విని... ఇదేం పాట, ట్యూన్ ఏం బాగోలేదని రాశి తిట్టుకుంది. కానీ ఇపుడు ఆమెకు తెగనచ్చేసింది' అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.

సినిమా చూసిన తర్వాత రాశీ ఏడుస్తూనే ఉంది

సినిమా చూసిన తర్వాత రాశీ ఏడుస్తూనే ఉంది

క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత ప్రేక్షకులు మిగతా అన్ని సీన్లు మరిచిపోతారు. అందరూ ఏడ్చేస్తారు అని రాశీ ఖన్నా చెప్పారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా రాశి ఏడుస్తూనే ఉంది అని నితిన్ గుర్తు చేశాడు.

ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ కాళ్లు మొక్కాను: రాశీ ఖన్నా

ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ కాళ్లు మొక్కాను: రాశీ ఖన్నా

సినిమా చూసిన తర్వాత సతీష్ గారి కాళ్లు మొక్కాను. ఇప్పటి వరకు ఎవరి విషయంలో అలా చేయలేదు. కథ విన్నపుడే చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలో ఉన్నందుకు గర్వంగా ఉంది... అని రాశీ ఖన్నా తెలిపారు.

రాశీ ఖన్నా మేనేజర్ టార్చర్ పెట్టాడు: దిల్ రాజు

రాశీ ఖన్నా మేనేజర్ టార్చర్ పెట్టాడు: దిల్ రాజు

రాశీ ఖన్నా రెమ్యూనరేషన్ విషయంలో మేనేజర్ చాలా ఇబ్బంది పెట్టారని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. కథ విన్న తర్వాత రెమ్యూనరేషన్ ఫైనల్ చేయలేదు. మేనేజర్‌ను ఆఫీసులో కూర్చోపెట్టి ఎలాగైనా నేను ఆ సినిమా చేయాలి అంటూ రాశీ అతడికి ఫోన్ల మీద ఫోన్లు చేసింది. కథ నచ్చింది కదా రెమ్యూనరేషన్ తగ్గించుకోమంటే అస్సలు వినలేదు. ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్‌కు ఓకే చేయించుకు రావాలని భీష్మించుకుంది. దీంతో అగ్రిమెంట్ చేసే వరకు ఆమె మేనేజర్ మమ్మల్ని టార్చర్ పెట్టారు.... అంటూ దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X