వినేవాళ్ళుంటే చెప్పేవాళ్లకేంలోకువ అన్నట్టుంది నిర్మాత వహారం
'రెడీ" రామ్ చిత్రాలలో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ చిత్రం సాధించిన కలెక్షన్స్ ని 'కందిరీగ" వారంలోనే అధిగమించి భారీ వసూళ్ళు సాధించి పెద్ద హిట్ అయినందుకు ఆనందంగా వుంది" అన్నారు బెల్లంకొండ సురేష్. రామ్ కథానాయకుడిగా సంతోష్‌శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం 'కందిరీగ". హన్సిక, అక్ష కథానాయికలు. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'జూలై 15న రాఘవ లారెన్స్ నటించి రూపొందించిన 'కాంచన" విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన మూడు వారాల తర్వాత ఆగష్టు 12న రామ్ నటించిన 'కందిరీగ" చిత్రం విడుదలైంది.
మా సంస్థ నుంచి వచ్చిన ఈ రెండు చిత్రాలని విజయవంతం చేసిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని నేనే విడుదల చేశాను. అక్కడ ఇప్పటి వరకు ఏచిత్రం సాధించని స్థాయిలో 'కందిరీగ" మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. రామ్ మంచి ఎనర్జిటిక్ హీరో. ఆయనే ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్ అయ్యారు. ఇక కథానాయికలు హన్సిక, అక్షలు చిత్ర విజయానికి తమ వంతు పాత్రని పోషించి చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చక్కని థమన్ అందించిన సంగీతం కూడా ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఫస్టాఫ్ లో సీరియస్ గా విలనిజాన్ని పండించిన సోనూసూద్ సెకెండ్ హాఫ్ లో ప్రేక్షకులకు చక్కని ఎంటర్ టైన్ మెంట్ ను అందించాడు. త్వరలో ఆయనను హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయబోతున్నాను. రెవెన్యూ పరంగా కూడా 'కందిరీగ" పెద్ద విజయాన్ని సాధిస్తోందని బయ్యర్స్ చెబుతుండటం ఆనందంగా వుంది"అన్నారు.


Click it and Unblock the Notifications











