"ఆరెంజ్" జ్యూస్ ని నేను అస్సలు ఇష్టపడను...వర్మ వెటకారం
రామ్ చరణ్ తాజా చిత్రం "ఆరెంజ్" పై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో తనదైన శైలిలో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఆయన వద్ద మీడియా ప్రస్దావించి..మీరు..ఆరెంజ్ విడుదల రోజు ఐ లైక్ ఆరెంజ్ జ్యూస్ అని ట్వీట్ చేసారు కదా..విషయం ఏమిటీ అంటే ...దానికాయన..నేను సాధారణంగా ఆరెంజ్ జ్యూస్ ని ఇష్టపడను. కానీ ఆ రోజు మా అమ్మ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చింది. చాలా విచిత్రంగా నాకు అది నచ్చింది. అందుకునే నేను ట్విట్టర్ లో ఆరెంజ్ జ్యూస్ బాగుంది అని ట్వీట్ చేసాను అన్నారు. ఇక ఆరెంజ్ చిత్రం ఫెంటాస్టిక్ ఉందని, యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ అని ట్వీట్ చేయటానికి కారణం కొందరు నాకు సిన్సియర్ గా ఆ చిత్రం చాలా అధ్భుతంగా ఉందని చెప్పారు.నేను అని నమ్మి అట్లా ట్వీట్ చేసాను అని అన్నారు.
అలాగే ఇక ఇంతకుముందు కూడా వర్మ..తాను చిరంజీవితో "దొర..ది లార్డ్" అనే చిత్రం చేయాలని ఉందని ఒకసారి, చిరంజీవి ఆయన 150 సినిమాని ఆయనే డైరక్ట్ చేసుకుంటే చూడాలని ఉందని మరోసారి అన్నారు. ఈ విషయం ప్రస్ధావిస్తూ..తాను సిన్సియర్ గానే దొర సినిమా ప్రపోజల్ పెట్టానని, అలాగే చాలామంది నమ్మి అభినందనలు కూడా తెలిపారని అన్నారు. తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చెబుతూ..పిబ్రవరి 2011 లో అమ్మ ప్రాజెక్టు ప్రారంభం కానుందని, ఇండియానా జోన్స్ మాదిరిగా సాహసాలతో నిండి ఉండే ప్రాజెక్టు అదని, మూడు భాషల్లో ఆ చిత్రాన్ని చేయబోతున్నానని, ఆ తర్వాత పోలీస్ వ్యవస్దపై డిపార్టమెంట్ అనే చిత్రం చేయబోతున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











