రాహుల్ గాంధీతో లక్స్ పాప ...
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై మనసు పడింది లక్స్ పాప ఆశాషైనీ. తనకు డేటింగ్ చేసే ఛాన్స్ వస్తే తన ఛాయిస్ ఆయనే అని తేల్చి చెప్పింది. డేటింగ్ మ్యాటర్ పై ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాల్ని స్పష్టం చేసింది. డేటింగ్ చేయడం వల్ల యువతీ యువకుల్లో ప్రేమ బంధం బాగా బలపడుతుంది. ముఖ్యంగా ఒక ఇంటివారు కావాలనుకునే యువతీ యువకుల మధ్య డేటింగ్ ఎంతో అవగాహన పెంచుతుందని చెపుతోంది. భార్యా భర్తలు కావాలనుకునే వారు తప్పనిసరిగా ముందుగానే డేటింగ్ లో పాల్గొనడం మంచిదని, అందులో తప్పులేదని ఆమె చెప్తోంది.
అలాగే సినిమాల్లో బికినీ ధరించి నటించడాన్ని కూడా తాను విభేదించనని అంటోంది. గ్లామర్ పాత్రలకు తాను అన్ని వేళలా సిద్ధం అంటోంది. తను నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం మేరకు గ్లామర్ పాత్రలే అంటోంది. కథను బట్టి ఎలాంటి పాత్రలో నటించడానికైనా, బికినీ, టూపీస్ దుస్తులు వేయడానికైనా సిద్ధమేనని చెపుతోంది. ఇక ప్రస్తుతం ఆశాషైనీ తన పేరుని మయూరి గా మార్చుకుని అవకాశాలు కోసం ఎదురుచూస్తోంది. మైకేల్ మదన కామరాజు లో విరగబడి విప్పి చూపించినా ఆ సినిమా వర్కవుట్ కాకపోవటంతో ఆమెకు ఆఫర్స్ రాలేదు. అడపాదడపా ప్యాషన్ షోలు అవీ ఇవీ అంటూ కాలం గడుపుకొస్తోంది. కాస్త ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తే నన్నా నిర్మాతలు ఆమెకు గుర్తు చేసుకుంటారనే ఆశ కనపడుతోంది.


Click it and Unblock the Notifications











