నాకో మగతోడు కావాలి

సెలీనా జైట్లీ మంచి తోడు కోసం ఎదురుచూస్తున్నానని చెప్తోంది. మూడేళ్ల నుంచీ తన జీవితంలో ప్రేమ లేకపోవడంతో బోరు కొట్టిందని అంటోంది. ఆ మధ్య ఈ సుందరాంగి కాలిఫోర్నియాకు చెందిన షాన్ టీగ్‌తో రెండున్నరేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఆ బ్రేక్ అప్ ఎందుకనో ఒంటరిగా మిగిలిపోయింది. ఖాళీగా ఉందికదా అంటూ ఈ మధ్యలో తోటి నటులతో ఆమెకు సంబంధాలు అంటగడుతూ ప్రచారాలు జరిగాయి. అయితే వాటినన్నిటినీ తోసిపుచ్చిన ఆమె షాన్ తర్వాత తనెవరితోనూ అనుబంధాన్ని నెలకొల్పుకోలేదని స్పష్టం చేస్తూ చెప్పుకొచ్చింది. ఇప్పటికిప్పుడు పెళ్లి ఆలోచనలు లేకపోయినా, మరోసారి ప్రేమలో పడేందుకు ఆమె సిద్ధంగా ఉన్నానని తెల్పింది.
movies telugu celina jaitley miss india bollywood california shan సెలీనా జైట్లీ బాలీవుడ్ షాన్ టీగ్


Click it and Unblock the Notifications