ఆయన దర్శకత్వంలో సోలో హీరోయిన్ గా చేసాకే రిటైర్మెంట్...త్రిష
మణిరత్నం దర్శకత్వంలో 'యువ"లో నటించాను. కానీ అందులో ముగ్గురు హీరోయిన్స్ లో నేను ఒకదాన్ని. మణిసార్ దర్శకత్వంలో సోలో హీరోయిన్‌గా నటించాలి. ఇవన్నీ తీరాక, అప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాను. ఆ తర్వాతే పెళ్లి అంటూ తన మనస్సులో మాట చెప్పుకొచ్చింది త్రిష.అలాగే హీరోల్లో రజనీకాంత్ సరసన చేయాలి.కమల్ సరసన కూడా చేసేసాను.ఆ కోరిక కూడా తీరాలి అంది.ప్రస్తుతం తమిళంలో అజిత్ 'మంకత"లో, తెలుగులో వెంకటేష్ సినిమా బాడీ గార్డ్ రీమేక్ లో, కన్నడంలో 'బుల్ బుల్" చిత్రాల్లో చేస్తూ బిజీగా ఉంది. అలాగే రీసెంట్ గా రెండు బాలీవుడ్ సినిమాలకు కూడా సైన్ చేసినట్టు సమాచారం.ఇక ఆమె నటించిన తీన్ మార్ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు.


Click it and Unblock the Notifications











