»   » నోరు విప్పింది: జూ ఎన్టీఆర్‌పై మనసు పడ్డ డైరెక్టర్ కూతురు

నోరు విప్పింది: జూ ఎన్టీఆర్‌పై మనసు పడ్డ డైరెక్టర్ కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురైన అలియా భట్ ఈ మధ్యే హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో దూసుకెలుతున్న ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమాలోనూ ముద్దు సీన్లు, బెడ్రూం సీన్లు చేస్తూ రెచ్చిపోతోంది. ప్రస్తుతం అలియా భట్ 'హమ్టీ శర్మ కి దుల్హనియా' సినిమాలో నటిస్తోంది. వరుణ్ ధావన్ ఈచిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

తాజాగా 'హమ్టీ శర్మ కి దుల్హనియా' చిత్రం ప్రమోషన్లో భాగంగా అలియా భట్, వరుణ్ ధావన్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా అలియా భట్ మాట్లాడుతూ తనకు తెలుగులో నటించాలని ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చింది. నాకు హైదరాబాద్‌లో నాకు స్నేహితులు కూడా ఉన్నారు. జూ ఎన్టీఆర్‌‍కు జోడీగా అయితే నేను బాగా సూటవుతాను అంటున్నారు. నాకు కూడా ఆయనతో నటించాలని ఉంది' అని అలియా భట్ చెప్పుకొచ్చింది.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

అలియా భట్

అలియా భట్

అలియా భట్ స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాలోనే ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ కనబరిచింది.

హైవే...

హైవే...

అలియా భట్ నటించిన రెండో చిత్రం ‘హైవే'. ఈచిత్రంలోనూ తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.

2 స్టేట్స్

2 స్టేట్స్

ఇటీవల అలియా భట్ నటించిన 2 స్టేట్స్ చిత్రం భారీ విజయం సాధించింది. ఈచిత్రం వసూళ్లు రూ. 100 కోట్లు దాటాయి.

హమ్టీ శర్మ కి దుల్హనియా

హమ్టీ శర్మ కి దుల్హనియా

ప్రస్తుతం అలియా భట్ హమ్టీ శర్మ కి దుల్హనియా చిత్రంలో నటిస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి శశాంక్ దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Alia Bhatt came to Hyderabad to attend the promotional event of her upcoming movie ‘Humpty Sharma Ki Dulhania’. When a journalist asked Alia Bhat whether she is interested to act in Telugu, Alia said “I would deifintely love to act in a Telugu movie. I have a friend in Hyderabad who said that I would make a good pair with NTR”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu