పెళ్లికి ముందే గర్భం దాలుస్తానంటున్న శృతి హాసన్!

By Bojja Kumar

హైదరాబాద్: పెళ్లికి ముందే గర్భం దాల్చడం అంటే భారతీయ సమాజంలో ఎంత పెద్ద తప్పుగా భావిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇదంతా సర్వసాధారణం. పాశ్చాత్య సంస్కృతి మన భారతీయ సమాజంలో ప్రవేశిస్తున్న తరుణంలో పెళ్లికి ముందే గర్భం దాల్చడం లాంటివి కూడా మన దేశంలో కూడా కామన్ అయిపోతున్నాయి.

ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిని మన సమాజంలోకి వ్యాపించేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సినిమా తారలు....పెళ్లికి ముందే గర్భం దాల్చడం లాంటి విషయాల్లోనూ ముందు ఉంటున్నారు. రాను రాను పరిస్థితి ఎలా తయారైంది అంటే...హాలీవుడ్ తారల మాదిరి పెళ్లికి ముందే గర్భం దాల్చడాన్ని కొందరు సినీ తారలు గొప్పగా భావించే స్థాయికి పరిస్థితులు మారుతున్నాయి.

హీరోయిన్ శృతి హాసన్ తల్లిదండ్రులైన కమల్ హాసన్ - సారిక దంపతులు పెళ్లికి ముందే శృతి హాసన్‌కు జన్మనిచ్చారు. ఇపుడు శృతి హాసన్ కూడా అదే దారిలో ప్రయాణిస్తానంటోంది. పెళ్లి ముందే తల్లికావాలని ఉందని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నా తల్లిదండ్రులది ఎంతో అందమైన దాంపత్యం. వారు కలిసున్నప్పుడో ఫీలింగ్ ఎంతో బాగుండేది. వారి మాదిరిగానే పెళ్లి ముందే బిడ్డకు జన్మనిస్తాను. ఆ తర్వాతే పెళ్లి విషయం ఆలోచిస్తాను' అని చెప్పుకొచ్చింది శృతి హాసన్.

పెళ్లికి ముందే గర్భవతులైన పలువురు హీరోయిన్ల వివరాలు స్లైడ్ షోలో.....

శృతి హాసన్

శృతి హాసన్


పెళ్లి ముందే తల్లి అవుతాను అంటూ శృతి హాసన్ చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

శ్రీదేవి

శ్రీదేవి


హీరోయిన్ శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే బోనీ కపూర్ కారణంగా శ్రీదేవి గర్భవతి అయింది. పెళ్లయ్యే నాటికి శ్రీదేవి 7 నెలల గర్బవతి.

రేణు దేశాయ్

రేణు దేశాయ్


హీరోయిన్ రేణు దేశాయ్ తెలుగు యాక్టర్ పవన్ కళ్యాణ్‌తో సహజీవనం చేసింది. పెళ్లి ముందు ఓ బిడ్డకు తల్లయింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

కొంకనా సేన్ శర్మ

కొంకనా సేన్ శర్మ


బాలీవుడ్ నటి కొంకణా సేన్ తన ప్రియుడు రణవీర్ షోరేను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగే నాటికి ఆమె 6 నెలల గర్భవతి.

మహిమా చౌదరి

మహిమా చౌదరి


బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి కూడా పెళ్లి ముందే గర్భవతైనట్లు వార్తలు వచ్చాయి.

అనౌష్క్ శంకర్

అనౌష్క్ శంకర్


ప్రముఖ సితార్ కళాకారుడు రవి శంకర్ కుమార్తె అయిన అసౌష్క శర్మ తన బాయ్ ఫ్రెండ్, బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ జియో రైట్ వల్ల పెళ్లికి ముందే గర్భం దాల్చింది.

సారిక

సారిక


శ్రీదేవి మాదిరిగా నటి సారిక కూడా కమల్ హాసన్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వల్ల సారిక పెళ్లికి ముందే గర్భవతి అయింది. అలా కలిగిన సంతానమే శృతి హాసన్.

మృతా అరోరా

మృతా అరోరా


బాలీవుడ్ హీరోయిన్ అమృతా అరోరా...తన బాయ్ ఫ్రెండ్ షకీల్ లడక్‌ను పెళ్లాడటానికి కారణం ఆమె పెళ్లికి ముందే గర్భవతి కావడం అనే రూమర్స్ అప్పట్లో వినిపించాయి.

సెలీనా జైట్లీ

సెలీనా జైట్లీ


మరో బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్ల కూడా పెళ్లికి ముందే గర్భవతి అయింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ పీటర్ హాగ్‌ను పెళ్లాడి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X