చిరంజీవితో రాధ కూతురు కోరిక తీరేనా?
యంగ్ హీరోయిన్ కార్తీకకు మెగా స్టార్ చిరంజీవితో డాన్స్ చేయాలని ఉందట. ఓ ప్రముఖ మేగజైన్‌తో మాట్లాడుతూ కార్తీక తన మనసులోని మాటను బయట పెట్టింది. చిరంజీవిగారు, మైమామ్ అప్పట్లో హాట్ ఫేవరెట్. వారిద్దరు కలిసి చేసిన డాన్స్‌లు ఫేమస్ అయ్యాయి. అవకాశం వస్తే చిరంజీవిగారితో కలిసి డాన్స్ చేయాలని ఉంది. అది నా డ్రీమ్ అంటోంది. మరి చిరంజీవి సినిమాలకు దూరం అయిన నేపథ్యంలో రాధ కూతురు కోరిక తీరుతుందో..లేదో..
చిరంజీవి, రాధ కలిసి 80ల్లో నటించిన సినిమాలో భారీ విజయాలు సాధించాయి. ముఖ్యంగా వీరిద్దరు కలిసి వేసే స్టెప్పులు అద్భుతంగా ఉండేవి. అప్పట్లో ప్రేక్షకులు ఈ జంట చేసే రొమాన్స్, డాన్సులు చూడటానికే థియేటర్లకు వచ్చేవారంటే వారి పెర్ఫార్మెన్స్ ఏ రేంజిలో ఉండోదో అర్థం చేసుకోవచ్చు.
రాధ కూతురుగా తెరంగ్రేటం చేసిన కార్తీక..... రాధ తరహాలో పేరు తెచ్చుకోలేక పోతోంది. కార్తీక నటన, గ్లామర్ యావరేజ్‌గా ఉండటమే ఇందుకు కారణం. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'జోష్'చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన కార్తీకకు తొలి చిత్రం నిరాశనే మిగిల్చింది.
రంగం చిత్రం ద్వారా ఆమెకు తొలి విజయం దక్కింది. తాజా ఇటీవల ఆమె నటించిన 'దమ్ము' చిత్రం సూపర్ హిట్టయింది. ఈ చిత్రంలో కార్తీక నటనకు మంచి మార్కులు పడ్డాయి.


Click it and Unblock the Notifications











