సునీల్‌కి దర్శకత్వం వహిస్తా: లారెన్స్
కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాఘవ లారెన్స్ ప్రస్తుతం దర్శకుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సునీల్ నటించిన 'పూల రంగడు' చిత్రం చూసిన లారెన్స్ సునీల్ పెర్ఫార్మెన్స్‌కి ఫిదా అయి పోయాడు. ఈ విషమై ఆయన మాట్లాడుతూ..చిత్రంలో సునీల్ యాక్టింగ్, డాన్సులు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కోసం సునీల్ ఎంత కష్ట పడ్డాడో ఆ కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించింది. అందరూ వెళ్లే దారిలో వెళ్లడం ఈజీగానే ఉంటుంది. కానీ సునీల్ తనకంటూ ఓ స్టైల్ ఏర్పరచుకుని, ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీతో చేసిన క్లైమాక్స్ ఫైట్ చూసి థియేటర్లో నేను క్లాప్స్ కొట్టి విజిల్స్ వేసి ఎంజాయ్ చేసాను. చిరంజీవిగారి డాన్స్‌ని, ఆయన డెడికేషన్‌ని చూసి నేను ఇన్ స్పైర్ అయి కష్టపడి ఈ రోజు ఓ మంచి స్థానాన్ని పొందగలిగాను, ఇప్పుడు సునీల్‌ని చూసి పది ఇన్ స్పైర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. హ్యాట్సాఫ్ టు సునీల్. చిరంజీవిగారు, మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్సీ, చరణ్ డాన్స్ చేస్తున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామో సునీల్ డాన్స్ చేస్తే కూడా అంత ఎంజాయ్ చేసాను. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సిక్స్ ప్యాక్ బాడీతో సునీల్ చేసిన ఫైట్ చూసి షాక్ అయ్యాను. సునీల్‌తో ఎప్పుడూ 'నేను ఒక పాట చేసి పెడతాను' అని అంటూ ఉండే వాన్ని. పూలరంగడు చూసాక సునీల్ చేసే ఓ సినిమాలో ఓ అద్భుతమైన ఫైట్ డిజైన్ చేసి తియ్యాలనుకుంటున్నాను'' అన్నారు.
లారెన్స్ వ్యాఖ్యలపై సునీల్ స్పందిస్తూ...లారెన్స్ మాస్టర్ నా గురించి అంత గొప్పగా చెప్పడం ఓ అవార్డుగా ఫీలవుతున్నాను. 'మాస్' చిత్రంలో నా మీద ఓ డెత్ సీన్ చేసి ఆడియన్స్ లో ఎంతో సింపతీని క్రియేట్ చేసిన లారెన్స్ మాస్టర్ అంటే నాకు ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











